మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ ప్రాంతంలో, తన మాజీ ప్రియుడు తమ ప్రైవేట్ (ఏకాంత) వీడియోలను తన భర్తకు పంపడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ.. వంటగదిలో వాడే కత్తెరతో అతడిని విచక్షణారహితంగా పొడిచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గ్వాలియర్ లలిత్పూర్ కాలనీలో నివసిస్తున్న ధర్మేంద్ర ప్రజాపతి (40), అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఆ మహిళ అతనితో విడిపోయి వేరొకరిని వివాహం చేసుకుంది.
వివాహం జరిగిన తర్వాత కూడా ధర్మేంద్ర ఆమెను నిరంతరం వేధించడంతో పాటు, వారిద్దరి మధ్య ఉన్న పాత ప్రైవేట్ ఆడియోలు, వీడియోలను ఆ మహిళ భర్తకు పంపించాడు.
దీంతో భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవలు చెలరేగాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ.. నేరుగా ధర్మేంద్ర ఇంటికి వెళ్లి అతనితో వాగ్వాదానికి దిగి, కత్తెరతో పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచింది.
రక్తపు మడుగులో కుప్పకూలిన ధర్మేంద్రను చుట్టుపక్కల వారు రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ మహిళను అరెస్టు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply