ముంబై: ముంబైలో ఒక వివాహితను అసభ్యకర వీడియోలతో బెదిరించి, ఆమె నుండి ఏకంగా రూ. 33 లక్షలు వసూలు చేసిన విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది.
మీరా రోడ్డులో డ్రైవర్గా పనిచేసే అమర్ మహాగాంకర్ అనే వ్యక్తి, ఫేస్బుక్ ద్వారా ఆ మహిళకు పరిచయమయ్యాడు. మహిళల కుటుంబ సమస్యలను తాను ముందే ఊహించగలనని నమ్మబలికి వారి విశ్వాసాన్ని పొందడం ఇతని అలవాటు. ఈ క్రమంలోనే ఆ మహిళను ఒక బీచ్కు తీసుకెళ్లి, ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు.
నిరంతర వేధింపులతో మనస్తాపానికి గురైన ఆ మహిళ, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు తన భర్తకు వాట్సాప్ సందేశం పంపింది. అది చూసి షాక్కు గురైన భర్త, భార్యను నిలదీయగా అసలు విషయం బయటపడింది. వెంటనే వారు మాల్వాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో ఆ వ్యక్తి జ్యోతిష్యుడు కాదని, మహిళలను మోసం చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడని తేలింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇంకా ఎంతమంది మహిళలను ఇలాగే మోసం చేశాడనే కోణంలో తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
