బంగారంపై కన్నేసిన జెన్ జీ తరం!! 90స్ కిడ్స్.. మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే!!

ప్రస్తుతం ప్రపంచమంతా జెన్ జీ (Gen Z) తరం గురించే మాట్లాడుకుంటోంది. 1997 నుండి 2012 మధ్య జన్మించిన వారిని మనం జెన్ జీ అని పిలుస్తాం. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో వీరి సంఖ్యే అధికంగా ఉంది. వీరి ఆలోచనా విధానం మునుపటి తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, ఖర్చులు లేదా పొదుపు.. ఇలా ప్రతి విషయంలోనూ జెన్ జీ తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా వీరు బంగారంపై చూపుతున్న ఆసక్తి గురించి ఒక ఆసక్తికరమైన సర్వే వెలువడింది.

సాధారణంగా భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. మన పూర్వీకుల నుండి ఇప్పటి తరం వరకు ఎవరి దగ్గర డబ్బున్నా నగలుగా కొని దాచుకోవడం ఆనవాయితీ. అయితే జెన్ జీ తరం బంగారాన్ని ఎలా చూస్తోందనే విషయంపై Smytten PulseAI అనే సంస్థ ఒక అధ్యయనం చేసింది.

సుమారు 5000 మందిపై జరిపిన ఈ సర్వేలో తేలిన ప్రధానాంశాలు ఇవే:

  • స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్: జెన్ జీ తరం బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగా కాకుండా, ఒక ‘స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్’గా చూస్తోంది. కుటుంబ సంప్రదాయం కోసం కాకుండా, ఆర్థిక నిర్వహణలో భాగంగా బంగారం ఉండాలని వారు భావిస్తున్నారు.
  • మొదటి ఛాయిస్ బంగారమే: మీ దగ్గర ఒక ₹25,000 ఉంటే ఎందులో పెట్టుబడి పెడతారు అని అడిగినప్పుడు.. 62% మంది బంగారం అని చెప్పారు. 15% మంది మ్యూచువల్ ఫండ్స్, 13% మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లు, 7% మంది స్టాక్ మార్కెట్ మరియు 2% మంది క్రిప్టో అని సమాధానమిచ్చారు.
  • స్వంత నిర్ణయం: 67% మంది తాము కుటుంబ సభ్యులు చెప్పారని కాకుండా, స్వయంగా విశ్లేషణ చేసి బంగారం కొంటున్నామని తెలిపారు.
  • పరిమాణం: వీరు ఎక్కువగా 5 గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారాన్ని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు.

Posted

in

by

Tags: