బంగారం కొని పెట్టుకున్న వారు ఇబ్బందుల్లో పడ్డారా? ఇప్పుడే అమ్మేయాలా.. లేక ఆగాలా? నిపుణులు ఏమంటున్నారు?

జనవరి నెలలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. కాసు(8 గ్రాములు ) బంగారం ధర ఏకంగా రూ. 1.31 లక్షలకు చేరింది. అయితే ఆ తర్వాత ధరల్లో భారీ పతనం మొదలైంది. గత రెండు రోజుల్లోనే తులంపై రూ. 2,080 తగ్గి, ప్రస్తుతం రూ. 1,13,600 వద్ద కొనసాగుతోంది. కేవలం 19 రోజుల్లోనే కాసుపై సుమారు రూ. 18,000 తగ్గడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

నిపుణుల సలహా: ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు లాభాలను స్వీకరించడం (Profit Booking) ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. గత కొంతకాలంగా బంగారం 100%, వెండి 200% వరకు అసాధారణ లాభాలను అందించాయి. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు మరో భారీ పెరుగుదలకు అవకాశం ఇవ్వడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ధరలు ఎందుకు పెరిగాయి? అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా వాణిజ్య విధానాలు, ద్రవ్యోల్బణం మరియు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల ధరలు పెరిగాయి. ఇక వెండి విషయానికి వస్తే.. సోలార్ ప్యానెళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు AI సాంకేతికతలో దీని వాడకం పెరగడం వల్ల ధరలు దూసుకుపోయాయి.

పెట్టుబడి ధోరణి: జనవరిలో భారతీయ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ కంటే బంగారం, వెండి ఈటీఎఫ్ (ETF) లలోనే ఎక్కువ పెట్టుబడి పెట్టారు. అయితే ఇప్పుడు ధరలు గరిష్ట స్థాయి నుండి అంతర్జాతీయంగా వెండి 36.63%, బంగారం 7.8% తగ్గాయి. అందుకే, కొత్తగా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దని, ఒకవేళ పెట్టాలనుకుంటే ఎస్‌ఐపి (SIP) పద్ధతిలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.


Posted

in

by

Tags: