కోయంబత్తూర్: ప్రయాణికులతో నిండి ఉన్న ప్రైవేటు బస్సులో ఓ యువతి డ్రైవర్ పక్కన గేర్ బాక్సుపై కూర్చుని, డ్రైవర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతోంది.
అసలేం జరిగింది? కోయంబత్తూర్‌లోని శివానంద కాలనీ నుండి రామనాథపురం ప్రాంతానికి వెళ్లే 5వ నంబర్ ప్రైవేట్ బస్సులో నిత్యం వందలాది మంది ప్రజలు, విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. అయితే, నిన్న డౌన్ హాల్ నుండి శివానంద కాలనీకి వెళ్తున్న ఈ బస్సులో ఒక యువతి ప్రయాణికుల సీట్లకు వెళ్లకుండా, నేరుగా డ్రైవర్ సీటు పక్కనే ఉన్న గేర్ బాక్సుపై కూర్చుంది.
బస్సు నడుస్తుండగానే, ఆ యువతి డ్రైవర్‌కు చాలా దగ్గరగా ఉంటూ, అతనితో మాట్లాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించింది. ఆమె తీరుతో డ్రైవర్ దృష్టి మళ్ళి, ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగేలా బస్సును నడిపాడు. ఈ ప్రమాదకరమైన దృశ్యాలను బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో, వాహనదారుల బాధ్యతారాహిత్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
