హైదరాబాద్‌లోని సేల్స్‌ఫోర్స్ సంస్థలో డిజైన్ లీడ్‌గా పనిచేస్తున్న అనుష్క అనే యువతి.. కార్పొరేట్ ఉద్యోగాలు అంటే కేవలం ఒత్తిడి, పని భారం మాత్రమే ఉంటాయనే అభిప్రాయానికి భిన్నంగా ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తన సంస్థ తనను అమెరికాలోని సియాటిల్‌కు 7 రోజుల పర్యటనకు తీసుకెళ్లిందని ఆమె తెలిపారు. అక్కడ ప్రకృతి అందాల మధ్య ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో తనకు వసతి కల్పించి, ఎంతో చక్కగా చూసుకున్నారని వీడియోలో ఆనందంగా వివరించారు.
పెద్ద టెక్నాలజీ కంపెనీలు తమ ఉద్యోగులను ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటాయనడానికి ఇదే ఉదాహరణ అని అనుష్క పేర్కొన్నారు.
అంతేకాకుండా యువత బాగా చదువుకుని.. మంచి భవిష్యత్తును, మంచి కెరీర్‌ను నిర్మించుకోవాలని ఆమె సూచించారు.
“బాగా చదువుకోండి.. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలు మిమ్మల్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె కార్పొరేట్ ఉద్యోగ జీవితాన్ని అతిగా గొప్పగా చూపిస్తున్నారని విమర్శించారు. మరికొందరు మాత్రం సేల్స్‌ఫోర్స్ వంటి సంస్థలు ఉద్యోగులకు అందించే మంచి పని వాతావరణం, సౌకర్యాలను ప్రశంసిస్తూ ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం అనుష్క షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది

Leave a Reply