“బాబోయ్! నవరాత్రి, దీపావళి పండుగల వేళ నకిలీ నెయ్యా..?” సూరత్‌లో ఆకస్మిక దాడులు.. 1700 కిలోలు స్వాధీనం.. పోలీసులకు చిక్కిన ‘డాల్డా’ ముఠా.. వైరల్ వీడియోతో హడలిపోతున్న జనం.. వెనుక ఉన్నది ఎవరు..??

రానున్న నవరాత్రి, దీపావళి పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార కల్తీ ముఠాలపై గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య శాఖ, స్థానిక పోలీసులు సంయుక్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు.

సూరత్‌లోని ఉత్రణ్ ప్రాంతం అభిరామ్ రోడ్డులో నకిలీ, కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, ఆరోగ్య శాఖ అధికారులు కలిసి సదరు ఫ్యాక్టరీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ సోదాల్లో మార్కెట్లో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన దాదాపు 1,694 కిలోల కల్తీ నెయ్యిని, దాని తయారీకి ఉపయోగించిన వనస్పతి (డాల్డా), సోయాబీన్ నూనె, యంత్రాలు మరియు ప్యాకింగ్ సామాగ్రిని అధికారులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.

సీజ్ చేసిన ఈ మొత్తం సరుకు విలువ సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుందని అంచనా వేయగా, ఆహార భద్రతా అధికారులు నెయ్యి శాంపిళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించారు.

ఈ అక్రమ ఫ్యాక్టరీని నడుపుతున్న కల్పేష్ మోదీ, కిసాన్ మోదీ అనే ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పండుగల వేళ ఈ కల్తీ నెయ్యిని ఎక్కడెక్కడ సరఫరా చేశారు? ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *