చెన్నై: కోట్లలో బిజినెస్ చేసే తమిళ నటీమణులు ఇక్కడ కొందరే ఉన్నారు.. వెండితెర మెరుపులను, కెమెరా వెలుగులను దాటి, దక్షణాది చిత్రసీమకు చెందిన అగ్ర నటీమణులు తమ వ్యాపార నైపుణ్యంతో పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్నే నిర్మిస్తున్నారు.
కేవలం నటనతోనే ఆగిపోకుండా, కోట్లాది రూపాయల విలువైన సొంత వ్యాపారాలను ప్రారంభించి, అందులో విజయవంతమైన వ్యాపారవేత్తలుగా కూడా రాణిస్తున్నారు.. వారిలో కొందరి గురించి ఇక్కడ చూద్దాం.
తమిళ సినిమాల లేడీ సూపర్ స్టార్ అని పిలవబడే నయనతార, నటనలోనే కాకుండా బిజినెస్‌లోనూ తిరుగులేని శక్తిగా అవతరించారు.
ది లిప్ బామ్ కంపెనీ ఆమె 9 స్కిన్ (9 SKIN) అనే అంతర్జాతీయ స్థాయి స్కిన్ కేర్ బ్రాండ్, మరియు ది లిప్ బామ్ కంపెనీ (The Lip Balm Company) అనే సౌందర్య సాధన సంస్థలను ప్రారంభించి నడుపుతున్నారు. ఈ కాస్మెటిక్స్ మాత్రమే కాకుండా, రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా సినిమాలను నిర్మిస్తూ సినిమాలో ప్రొడ్యూసర్‌గా తన మార్క్ చూపిస్తున్నారు.
తర్వాతి స్థానంలో, దక్షణాది అగ్ర నటి సమంత రూత్ ప్రభు, తన బహుముఖ ప్రజ్ఞతో ఒక పెద్ద లైఫ్‌స్టైల్ సామ్రాజ్యాన్నే నిర్మించారు. మహిళల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసే సాకి (Saaki) దుస్తుల బ్రాండ్, సీక్రెట్ ఆల్కెమిస్ట్ (Secret Alchemist) అనే సుగంధ ద్రవ్యాల సంస్థ మరియు ఎస్.వి.ఎస్ పార్ట్నర్స్ (SVS Partners) పెట్టుబడి సంస్థ వంటి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
ఇది కాకుండా, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే సొంత నిర్మాణ సంస్థ ద్వారా కొత్త కొత్త చిత్రాలను రూపొందిస్తున్నారు.
శృతి హాసన్ బిజినెస్ బహుముఖ ప్రజ్ఞ కలిగిన నటి శృతి హాసన్, పారిశ్రామిక రంగంలోనూ అడుగుపెట్టే ఉద్దేశంతో ఇసిడ్రో (Isidro) పేరిట తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ముఖ్యంగా లఘు చిత్రాలు, యానిమేషన్ సినిమాలు మరియు వీడియో రికార్డింగ్లపై దృష్టి సారిస్తుంది. ఆమె బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా, ఆమె చెల్లెలు అక్షర హాసన్ ఈ నిర్మాణ సంస్థను ముందుండి నిర్వహిస్తున్నారట.
చిరునవ్వుల రాణి స్నేహ, చెన్నై త్యాగరాయ నగర్ మధ్యలో స్నేహాలయ సిల్క్స్ (Snehalaya Silks) అనే భారీ పట్టు చీరల సంస్థను నడుపుతూ, సాంప్రదాయ దుస్తుల ద్వారా విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తగా నిలిచారు.
ఆన్లైన్ నగల డిజైనింగ్ అదేవిధంగా, అగ్ర నటి తమన్నా వైట్ అండ్ గోల్డ్ (Wite & Gold) అనే ప్రత్యేక ఆన్లైన్ జ్యువెలరీ డిజైనింగ్ సంస్థను ప్రారంభించి, ఆభరణాల రంగంలో కొత్త ట్రెండ్‌ను సృష్టించి అందరి దృష్టినీ ఆకర్షించారు.
అమ్మ పాత్రలో నటించి, తనదైన ముద్ర వేసిన సీనియర్ నటి శరణ్య పొన్వణ్ణన్, తన కళాత్మక నైపుణ్యానికి తోడు డిసాఫ్ట్ (DSOFT) అనే దుస్తుల డిజైనింగ్ మరియు టైలరింగ్ శిక్షణ పాఠశాలను నడుపుతూ, చాలా మంది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.
ఫిట్‌నెస్‌పై తీవ్ర ఆసక్తి ఉన్న నటి రకుల్ ప్రీత్ సింగ్, ఎఫ్45 (F45 Training) అనే అంతర్జాతీయ జిమ్ సెంటర్‌ను నడుపుతుండటంతో పాటు, గ్లోబల్ హెల్త్ మరియు ఫుడ్ బ్రాండ్లను ఇండియన్ మార్కెట్‌కి తీసుకొచ్చే బిజినెస్‌లోనూ నిమగ్నమయ్యారు.
బిజినెస్ ఉమెన్ రూపం వీరితో పాటు నటి శ్రియ శరణ్, దివ్యాంగులకు ఉపాధి కల్పించాలనే ఉన్నతమైన ఉద్దేశంతో, దృష్టి లోపం ఉన్న నిపుణులతో నడిచే శ్రీ స్పా (Shree Spa) అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్‌ను నడుపుతున్నారు.
అలాగే బుల్లితెరపై, వెండితెరపై ప్రసిద్ధి చెందిన శృతికా అర్జున్, ‘శృతికా కాస్మెటిక్స్’ (Shrutika Cosmetics) పేరిట తన సొంత సౌందర్య సాధనాల సంస్థను ప్రారంభించి నేటి తరం యువతలో విశేష ఆదరణ పొందారు.
మొత్తానికి సినిమాలో నటనా ప్రతిభనే కాకుండా, తమదైన ప్రణాళికతో, కష్టపడే తత్వంతో ఈ దక్షణాది నటీమణులు కార్పొరేట్ ప్రపంచాన్ని సైతం విస్తుపోయేలా చేస్తున్నారు….!!!
