మలయాళ సినిమాలో వచ్చే నాణ్యమైన క్రైమ్ థ్రిల్లర్లకు ఏమాత్రం తీసిపోని ఒక కన్నడ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవలే కన్నడలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకున్న భావన గౌడ ప్రధాన పాత్రలో నటించిన చిత్రమే ‘రుద్రి’.
కథ ఏమిటి? కర్ణాటకలోని ఒక గ్రామంలో తన అమ్మమ్మతో కలిసి నివసించే కథానాయికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆ యువతి, తనను హింసించిన వారిపై ఎలా పగ తీర్చుకుంది అనేదే ఈ చిత్ర ప్రధానాంశం. ఈ సినిమాలో సమాజానికి అవసరమైన ఒక బలమైన సందేశాన్ని అందించారు. అందుకే ఈ సినిమా విమర్శకుల నుండి గొప్ప ప్రశంసలు పొందింది.
క్లైమాక్స్ ట్విస్ట్: ఈ సినిమాకు అతిపెద్ద బలం క్లైమాక్స్. ఇందులోని ముగింపు దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. సోషల్ మీడియాలో ఈ క్లైమాక్స్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా 13 అవార్డులను గెలుచుకుంది. ఇందులో చెప్పిన సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలని సినిమాను కొనియాడారు.
ఎక్కడ చూడవచ్చు? ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) OTTలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
