బెంగళూరు మహిళ ‘దాల్ చావల్’ స్టైల్‌లో సుషీ విందు.. వీడియో చూసి జపాన్ వారు స్పృహతప్పి పడిపోతారేమో!

సుషీ తినే అన్ని పద్ధతులను చూశామని మీరు అనుకుంటే, పొరపాటే! ఒక బెంగళూరు మహిళ సుషీని ఎవరూ ఊహించని విధంగా తింటూ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది.

సాధారణంగా సుషీని చాప్‌స్టిక్స్‌తో ఎంతో సున్నితంగా తింటారు. సోయా సాస్‌లో కొద్దిగా ముంచి, వసాబీ (Wasabi)ని అద్దుకుని తినడం పద్ధతి. కానీ ఈ వైరల్ వీడియోలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యం కనిపించింది.

సుషీనా లేక పప్పు అన్నమా? ఆ మహిళ ఒక సుషీ ముక్కను చేతితో తీసుకుని ప్లేట్‌లో పెట్టుకుంది. ఇక్కడి వరకు అంతా మామూలే అనుకుంటే.. వెంటనే ఆమె తన వేళ్లతో ఆ సుషీని పూర్తిగా నలిపేసింది. ఆపై సోయా సాస్‌ను నేరుగా ఆ మిశ్రమంపై పోసి, వసాబీని కూడా కలిపేసింది. మన ఊరి పప్పు అన్నంలా ఆ మిశ్రమాన్ని కలిపి, చక్కగా చేత్తో ముద్దలు చేసుకుని తిన్నది.

“మీరు మొదటిసారి సుషీ తిన్నప్పుడు…” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. “జపాన్ సంస్కృతిని అవమానించడం నా ఉద్దేశ్యం కాదు, నాకు సుషీ అంటే ఇష్టం” అని ఆమె వివరణ ఇచ్చింది.

నెటిజన్ల రియాక్షన్: ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అంత వసాబీని కలిపి తింటుంటే నాకే భయమేస్తోంది” అని ఒకరు రాయగా, “మరో 12 లేయర్ల లాసాగ్నాను కూడా ఆమె ఇలాగే తింటుందేమో చూడాలి” అని మరొకరు జోక్ చేశారు. “చేత్తో తినడం వేరు, కానీ దానిని అలా చిదిమేయడం ఎందుకు?” అని మరికొందరు విమర్శించారు. ఏదేమైనా, గ్లోబల్ వంటకాలను మన స్థానిక పద్ధతుల్లో తినడంపై ఈ వీడియో ఒక పెద్ద చర్చకు దారితీసింది.


Posted

in

by

Tags: