ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్ నువానిదు ఫెర్నాండో.. అంపైర్ నితిన్ మీనన్ ఇచ్చిన తప్పుడు ఔట్ తీర్పుతో పెవిలియన్ చేరడం తీవ్ర వివాదాస్పదమైంది.
మ్యాచ్ నాలుగో ఓవర్లో బౌలర్ అలిస్ అల్ ఇస్లాం వేసిన బంతిని ఫెర్నాండో ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో బంతికి, బ్యాట్‌కు మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన అప్పీల్‌కు అంపైర్ నితిన్ మీనన్ ఔట్ అని వేలెత్తాడు. దీంతో తీవ్ర షాక్‌కు గురైన ఫెర్నాండో నిరాశగా మైదానం వీడాడు.
ఈ మ్యాచ్‌లో డీఆర్ఎస్ (DRS) టెక్నాలజీ లేకపోవడంతో, అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన టీవీ రీప్లేలో బంతి బ్యాట్‌కు అసలు తగలలేదని స్పష్టంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ తీర్పుపై తీవ్ర విమర్శలు, చర్చలు జరుగుతున్నాయి.
మ్యాచ్ ఆరంభంలో శ్రీలంక జట్టు 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తడబడినప్పటికీ, తరిందు రత్నాయకే (65 పరుగులు) ఆడిన అద్భుత ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 165 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 102 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక జట్టు 63 పరుగుల తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Leave a Reply