“బ్యాట్‌తో మైదానాన్ని ఊపేసిన కంగారూ కెప్టెన్”. 35 మ్యాచ్‌ల్లో 1502 పరుగులు. కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించిన మిచెల్ మార్ష్.. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే మొదటి ఆటగాడిగా భారీ రికార్డు.!

క్రికెట్ మైదానంలో తన బలమైన ఇనుప భుజాలతో, మైదానం నలుమూలలా బంతిని నలువైపులా సిక్సర్లుగా పంపే విద్వంసకర బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకున్నవాడు ఆస్ట్రేలియా వన్డే మరియు టి20 జట్ల కెప్టెన్ మిచెల్ మార్ష్.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రసిద్ధ ‘ది హండ్రెడ్’ టోర్నమెంట్‌లో ప్రత్యర్థి జట్లను భయపెడుతున్న ఇతడు, తన ధనాధన్ ఆటతీరుతో ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు ఏ ఆటగాడూ చేరుకోని ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌ల్లో పరుగుల వేటలో అగ్రస్థానంలో కొనసాగుతున్న మిచెల్ మార్ష్, ఒక క్యాలెండర్ ఇయర్‌ (క్యాలెండర్ సంవత్సరంలో) 1500 లేదా అంతకంటే ఎక్కువ టి20 పరుగులు సాధించిన మొదటి ఆస్ట్రేలియా ఆటగాడిగా ఘనత సాధించాడు. అంతకుముందు, తోటి ఆటగాడు టిమ్ డేవిడ్ 2022వ సంవత్సరంలో 68 ఇన్నింగ్స్‌లలో ఆడి 27.67 సగటుతో 1461 పరుగులు చేయడమే రికార్డుగా ఉండేది. కానీ, ఆ రికార్డును చాలా సులభంగా తిరగరాశాడు మార్ష్.

ఈ రికార్డును సాధించడానికి మార్ష్ తీసుకున్న మ్యాచ్‌ల సంఖ్యే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేవలం 35 మ్యాచ్‌ల్లో మాత్రమే బరిలోకి దిగిన అతను, 44.17 సగటుతో 1502 పరుగులు రాబట్టాడు. ఇతని భయానక స్ట్రైక్ రేట్ దాదాపు 160 స్థాయిలో ఉంది. ఇప్పటివరకు ఈ ఒక్క సంవత్సరంలోనే 2 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు బాది పడేసాడు.

ఈ సంవత్సరంలో ఆస్ట్రేలియా జట్టు తరఫున అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టు మరియు ఐపీఎల్ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ వంటి జట్ల తరఫున ఆడి మార్ష్ ఈ బ్రహ్మాండమైన పరుగుల విధ్వంసాన్ని సృష్టించాడు.


Posted

in

by

Tags: