ఇటీవలి కాలంలో భర్తలను లేదా ప్రియులను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనలు దేశవ్యాప్తంగా వివాహిత పురుషుల్లో భయాందోళనలు నింపుతున్నాయి. ఈ భయం నుండి బయటపడేందుకు ఒక కొత్త పెళ్లికొడుకు చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, అందమైన కొండ ప్రాంతాల నేపథ్యంలో ఒక నూతన దంపతులు చాలా రొమాంటిక్‌గా ఫోజులిస్తున్నారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారి వెనుక తుపాకీలు పట్టుకుని భారీ భద్రతతో బాడీగార్డులు నిలబడి ఉన్నారు.
వీడియో ప్రారంభంలో ఆ భర్త ముఖంలో “ఎవరైనా వెనుక నుండి నెట్టేస్తారేమో” అన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, ఆయుధాలతో ఉన్న తన బాడీగార్డులను చూడగానే అతనికి ధైర్యం వచ్చి, తన భార్యతో నవ్వుతూ హాయిగా ఫోజులివ్వడం గమనార్హం.
@dontwaityz అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియో, లక్షలాది వ్యూస్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇది నిజానికి వినోదం కోసం (Fun Video) తీసినదే అయినప్పటికీ, నెటిజన్లు మాత్రం, “ఈ కాలంలో రొమాన్స్ కంటే ప్రాణమే ముఖ్యం తమ్ముడూ, నువ్వు తీసుకున్న జాగ్రత్త బాగుంది!” అంటూ 2026 నాటి ట్రెండింగ్ మీమ్స్‌తో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
