బ్రిటన్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఈ మాజీ సూపర్ పవర్, నేడు సైనిక శక్తి విషయంలో భారత్ కంటే వెనుకబడి ఉన్నా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యత్వాన్ని మాత్రం వదులుకోవట్లేదు.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడవ్వడం, నాటో (NATO) కూటమిలో అంతర్గత విభేదాల నేపథ్యంలో దేశాల సైనిక శక్తిపై చర్చ మొదలైంది. ఒకప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా వెలిగిన బ్రిటన్‌ను, నేటి భారత్‌తో పోల్చి చూస్తే ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి.
భారత్ vs బ్రిటన్: సైనిక గణాంకాలు
| ఆయుధ సంపత్తి | భారతదేశం | బ్రిటన్ (UK) |
| గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంక్ | 4వ స్థానం | 6వ స్థానం |
| క్రియాశీల సైన్యం | ~14,55,000 | ~1,44,000 |
| మొత్తం విమానాలు | 2,229 | 631 |
| యుద్ధ ట్యాంకులు | 4,200 | 227 |
| నౌకాదళ ఆస్తులు | 295 | 75 |
ముఖ్యమైన వ్యత్యాసాలు:
- ఆర్మీ : ట్యాంకుల విషయంలో భారత్ బ్రిటన్ కంటే ఎంతో శక్తివంతమైనది. భారత్ వద్ద 4200 ట్యాంకులు ఉంటే, బ్రిటన్ వద్ద కేవలం 227 మాత్రమే ఉన్నాయి.
- ఎయిర్ ఫోర్స్: భారత వైమానిక దళం బ్రిటన్ కంటే నాలుగు రెట్లు పెద్దది. అయితే బ్రిటన్ వద్ద 5వ తరం యుద్ధ విమానాలు (F-35) ఉండగా, భారత్ ప్రస్తుతం 4.5 తరం విమానాలతో ఉంది.
- నేవీ: ఒకప్పుడు సముద్రాలను శాసించిన బ్రిటన్ ఇప్పుడు భారత్ కంటే వెనుకబడింది. భారత్ వద్ద యుద్ధనౌకలు (Destroyers, Frigates) ఎక్కువగా ఉన్నాయి. అయితే అణు సామర్థ్యం గల సబ్ మెరైన్ల విషయంలో బ్రిటన్ హైటెక్ సాంకేతికతను కలిగి ఉంది.
