బ్రేకింగ్: ఏసీ పేలుడుతో భీకర అగ్నిప్రమాదం; 9 మంది సజీవ దహనం!

న్యూఢిల్లీలోని వివేక్ విహార్‌లోని ఒక నివాస భవనంలో ఏసీ (AC) పేలి సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు.

వివేక్ విహార్‌లోని నాలుగు అంతస్తుల నివాస భవనంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 3:47 గంటల ప్రాంతంలో ఏసీ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో, చాలామంది బయటకు రాలేక ప్రాణాలు కాపాడుకోవడానికి విలవిలలాడారు. సమాచారం అందుకున్న వెంటనే 14 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.

భవనం లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.


Posted

in

by

Tags: