న్యూఢిల్లీ: ఈ రోజు సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు రానున్నారు. పుతిన్ భద్రత కోసం ఐదు అంచెల చర్యలు తీసుకున్నారు. ఎంతలా అంటే, పుతిన్ యొక్క మలం, మూత్రం కూడా తిరిగి రష్యాకు తీసుకువెళతారు. దీనికి కారణం ఏంటో తెలుసా?
పుతిన్‌కు ఎలాంటి భద్రత కల్పించారంటే, ఆయన అనుమతి లేకుండా ఒక దోమ కూడా దగ్గరికి రాదు. భద్రత కోసం 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న సిబ్బందిని మాత్రమే నియమించారు. భద్రతా సిబ్బంది 5.8 నుండి 6.2 అడుగుల ఎత్తు ఉండాలి. పుతిన్ ప్రయాణించే కారు పంచర్ అయినప్పటికీ సులభంగా ముందుకు నడవగలదు.
సాయుధ విలాసవంతమైన కారు అరుస్ సెనాట్ ను మాస్కో నుంచే తీసుకువస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు, రష్యా అధ్యక్ష భద్రతా సేవల సిబ్బందితో పాటు భారత ఎన్ఎస్జి కమాండోలు కూడా భద్రత కల్పిస్తారు.
అన్నింటికంటే ముఖ్యంగా, పుతిన్ మలం, మూత్రం కూడా రష్యాకు తిరిగి తీసుకువెళతారు. దీనికి ఒక కారణం ఉంది. మలం, మూత్రం సేకరించడం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలుసుకోవచ్చు అనేదే రష్యా ఆందోళన. దీని కోసం, మలం, మూత్రాన్ని సేకరించడానికి పూప్ సూట్‌కేస్‌లు (Poop Suitcases) కూడా భారతదేశానికి తీసుకువచ్చారు. దీనితో పాటు, ఆయనకు అందించే ఆహారాన్ని కూడా ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే ఇస్తారు.
