అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం, 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి సాధారణ బీపీ 120/80 mmHg కంటే తక్కువగా ఉండాలి. వయస్సు పెరిగే కొద్దీ రక్త నాళాలు (ధమనులు) గట్టిపడటం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
బీపీ చార్ట్: అలసట మాత్రమే కాదు, ప్రమాద హెచ్చరిక కావచ్చు! ఉదయం నిద్రలేవగానే కళ్లు తిరగడం, కళ్ల ముందు మసకగా అనిపించడం, తరచుగా తలనొప్పి లేదా అకస్మాత్తుగా ఏమీ కనిపించకుండా పోవడం (బ్లాక్ అవుట్) వంటివి కేవలం అలసట వల్ల వచ్చేవి కావు. ఇవి మీ రక్తపోటులో మార్పులకు సంకేతాలు కావచ్చు. మన గుండె రక్తాన్ని శరీరమంతటికీ పంపింగ్ చేసేటప్పుడు రక్త నాళాల గోడలపై పడే ఒత్తిడినే ‘బ్లడ్ ప్రెజర్’ అంటారు. ఇది మరీ ఎక్కువగా ఉన్నా (హై బీపీ) లేదా మరీ తక్కువగా ఉన్నా (లో బీపీ).. గుండె, మెదడు మరియు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
యవ్వనంలో పురుషుల్లో బీపీ ఎక్కువగా కనిపిస్తుంది, అయితే మహిళల్లో మెనోపాజ్ (ముట్లు ఉడకడం) తర్వాత దీని ముప్పు పెరుగుతుంది.
ప్రపంచవ్యాప్త పరిస్థితి: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ కాలం బీపీ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు మరియు స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మన శరీరానికి ఉండాల్సిన సాధారణ బీపీ స్థాయి ఎంత అనే అవగాహన ఉండటం చాలా ముఖ్యం.
