భయం నీడలో సంబరాలు… వెనిజులా ప్రజలు అమెరికా చర్యను ఎందుకు స్వాగతిస్తున్నారు?

ఒక దేశ అధ్యక్షుడిని పొరుగు దేశం బంధించినప్పుడు ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయాలి. కానీ వెనిజులా విషయంలో అందుకు విరుద్ధంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ చమురు నిల్వలలో 18% వాటా కలిగి ఉండి కూడా, వెనిజులా ప్రజలు తమ అధ్యక్షుడి పతనాన్ని ఎందుకు కోరుకున్నారో అర్థం చేసుకోవాలంటే ఆ దేశ చరిత్రను చూడాలి.

చావెజ్ నుండి మదురో వరకు: పతనం ఇలా మొదలైంది
  • హ్యూగో చావెజ్ (1999-2013): సోషలిజం పేరుతో ‘పొలివేరియన్ విప్లవం’ తీసుకొచ్చారు. చమురు నిక్షేపాలను జాతీయం చేసి, అమెరికా పెత్తనాన్ని ఎదిరించారు. మొదట్లో పేదల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినా, ఆయన హయాం చివరలో ఆర్థిక మాంద్యం మొదలైంది.
  • నికోలస్ మదురో (2013-ప్రస్తుతం): చావెజ్ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన మదురో పూర్తి స్థాయి సర్వాధికారిగా మారారు. 2018 ఎన్నికల్లో ప్రతిపక్షాలను పోటీ చేయనివ్వలేదు. 2024లో ఎన్నికలు నిర్వహించకుండా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఆయన పాలనలో దేశం ఆకలి చావులు, మాదకద్రవ్యాల ముఠాల అరాచకాలతో అతలాకుతలమైంది.
ప్రవాస వెనిజులా ప్రజల ఆనందం

స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ మరియు అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది వెనిజులా వాసులు వీధుల్లోకి వచ్చి మదురో అరెస్టును వేడుకగా జరుపుకున్నారు. “దశాబ్దాల అణచివేత నుండి మా దేశానికి విముక్తి లభించింది” అని వారు నినదిస్తున్నారు. కొందరు డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాలతో ప్రదర్శనలు నిర్వహించారు.

ప్రశ్నలు మరియు ఆందోళనలు

సంబరాలు ఒకవైపు ఉన్నా, మేధావులు మరియు కొంతమంది సామాన్యులు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు:

  • విదేశీ ఆక్రమణ: అమెరికా విముక్తి పేరుతో తమ దేశ వనరులను (చమురును) ‘స్టాక్’ చేసుకుంటుందేమోనని కొందరి భయం.
  • గత అనుభవాలు (ఇరాక్, లిబియా): 2003లో ఇరాక్ ప్రజలు సద్దాం హుస్సేన్ పతనాన్ని ఇలాగే వేడుక చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అమెరికా ఆక్రమణలో ఇరాక్ చిధ్రమైంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఏ అణు ఆయుధాలు దొరకలేదు.
  • అస్థిరత: ఒక సర్వాధికారిని తొలగించడం సులభమే, కానీ ఆ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని, స్థిరమైన ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం చాలా కష్టం.

Posted

in

by

Tags: