భర్తను కరెంట్ షాక్‌తో చంపిన భార్య: చివరకు పోలీసుల ముందు ప్రాధేయపడుతూ.. “ఒక్కసారి నా భర్త ముఖం చూడనివ్వండి” అని వేడుకోలు!

మురాదాబాద్: సొంత మేనల్లుడిని పెళ్లి చేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతో, ఒక భార్య తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. మజ్హోలా ప్రాంతానికి చెందిన పవన్ ఠాకూర్‌ను, అతని భార్య ఆంచల్ తన ప్రియుడు అంకిత్‌తో కలిసి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చింది. ఆపై అది ఆత్మహత్య అని నమ్మించేందుకు బలవంతంగా విషం కూడా తినిపించారు.

ఏం జరిగింది? ఈ దారుణంలో ఆంచల్‌కు ఆమె సోదరి శిఖ, శిఖ ప్రియుడు అజయ్ దివాకర్ కూడా సహకరించారు. జిజా (బావ) మరణం తర్వాత ఆ ఇంట్లోనే తన ప్రియుడితో కలిసి హాయిగా ఉండవచ్చని శిఖ కూడా ఈ నేరంలో భాగస్వామి అయ్యింది. అయితే, వీరి ప్లాన్ ఎక్కువ కాలం నిలవలేదు. పోస్టుమార్టం నివేదికలో పవన్ ఠాకూర్ మరణానికి కరెంట్ షాక్ కారణమని తేలడంతో అసలు రంగు బయటపడింది.

అరెస్టయిన నిందితులు: మృతుడి సోదరుడు దేవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భార్య ఆంచల్, ఆమె ప్రియుడు అంకిత్, సోదరి శిఖ మరియు ఆమె ప్రియుడు అజయ్ దివాకర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.

పోలీసుల ముందు వేడుకోలు: నిందితురాలు ఆంచల్ పోలీసులకు పట్టుబడిన తర్వాత, తాను చేసిన తప్పును తెలుసుకున్నానని, తన భర్త పవన్ ఠాకూర్ ముఖాన్ని చివరిసారిగా చూడాలని, అతనిని క్షమాపణ అడగాలని పోలీసుల ముందు కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే, తన కామవాంఛ కోసం కన్న భర్తను కడతేర్చిన ఆమె పశ్చాత్తాపం ఇప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు.


Posted

in

by

Tags: