భర్తను చంపినా బుద్ధి రాలేదు.! ప్రియుడిని కూడా వదిలేసి మరొకరితో 2వ పెళ్లి. హంతక భార్య రహస్య జీవితం. ఎలా దొరికిందంటే..?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్‌పత్ (Baghpat) కొత్వాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి రియాసత్. అతని భార్య సయిన్ అలియాస్ సైనాకు, అదే ప్రాంతంలో నివసిస్తున్న సారిమ్ అలియాస్ కట్టా అనే వ్యక్తికి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ విషయం భర్తకు తెలియడంతో తలెత్తిన వివాదంలో, గత 2025 నవంబర్ 25న భార్య, ఆమె ప్రియుడు కలిసి పథకం పన్ని రియాసత్‌ను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.

హత్య జరిగిన రోజు భర్త తప్పించుకోవడానికి ప్రయత్నించగా, భార్య సయిన్ తన భర్త కాళ్లు పట్టుకోగా, ప్రియుడు సారిమ్ కత్తితో ఛాతీపై విచక్షణారహితంగా పొడిచి కిరాతకంగా చంపి పారిపోయారు. దీనిపై హత్యకు గురైన రియాసత్ సోదరుడు ఇష్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తుండగా, ప్రియుడు సారిమ్ కోర్టులో లొంగిపోయాడు. కానీ, హత్య తర్వాత సయిన్ ఆ ప్రియుడిని వదిలేసి, ముజఫర్‌నగర్ ప్రాంతంలో మరొక యువకుడిని రెండో వివాహం చేసుకుని అజ్ఞాతంలో జీవిస్తోంది.

పరారీలో ఉన్న సయిన్‌పై 25 వేల రూపాయల రివార్డు ప్రకటించి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో, రహస్య సమాచారం ఆధారంగా పోలీసులు సయిన్‌ను ఒక లాడ్జి సమీపంలో వెంబడించి పట్టుకుని అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, సయిన్ అరెస్టయినప్పటికీ తమకు రక్షణ లేదని మృతుడు రియాసత్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు తమను బెదిరించి కేసును వెనక్కి తీసుకోవాలని నిరంతరం భయాందోళనలకు గురిచేస్తున్నారని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు పోలీసులను కోరారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *