ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన 28 ఏళ్ల వివాహిత, ఇటుకలతో దాడికి గురై దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.
దీపావళి పండుగ కోసం మహిళ భర్త సొంతూరు వెళ్లగా, ఆమె ప్రియుడిని కలిసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో జరిగిన గొడవే ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. మృతురాలిని పింకీగా గుర్తించారు.
బులంద్‌షహర్ ప్రాంతానికి చెందిన పింకీ, తన భర్త ప్రమోద్‌తో కలిసి ఘజియాబాద్‌లోని ఇంద్రపురి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ప్రమోద్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పింకీకి, పింటూ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పింకీ స్నేహితురాలు శివానికి, పింటూ స్నేహితుడు ఆర్యన్‌తో పరిచయం ఉందని సమాచారం. భర్త దీపావళికి ఊరికి వెళ్లిన సమయంలో, తాను పింటూను కలవాలనుకుంటున్నట్లు పింకీ తన స్నేహితురాలికి చెప్పింది.
దీంతో శివాని ఆర్యన్‌తో మాట్లాడి, పింకీ, పింటూలు అతని గదికి వస్తారని చెప్పింది. ఆ ప్రకారం సోమవారం రాత్రి పింకీ, పింటూ ఇద్దరూ ఆర్యన్ గదికి వెళ్లారు. అక్కడ ఆర్యన్ కూడా ఉన్నాడు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఏదో విషయంపై ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో కోపోద్రిక్తులైన పింటూ, ఆర్యన్.. ఇటుకతో పింకీ తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
దాడి అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. గదిలోంచి అరుపులు విన్న స్థానికుడు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రక్తపు మడుగులో పడి ఉన్న పింకీని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పింటూ, ఆర్యన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ గదిలో మద్యం సీసాలతో పాటు కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పింకీ గర్భవతి అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ విషయం అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ దారుణ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply