“భర్త పక్కన కూర్చోవాలట, దానికోసం ఇలాగేనా?”.. 10 గంటల పాటు సీటు మార్చడానికి నిరాకరించిన ప్రయాణికురాలు.. 3 గంటల పాటు ఏడ్చిన మరో మహిళ.. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో..!!

10 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ విమాన ప్రయాణంలో, తన భర్త పక్కన కూర్చోవాలనే ఉద్దేశంతో సీటు మార్చి ఇవ్వాలని కోరిన మహిళకు సీటు ఇచ్చేందుకు నిరాకరించిన ప్రయాణికురాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

అసలు ఏం జరిగింది?
అమెరికాకు చెందిన ట్రావెల్ వీడియో బ్లాగర్ టోమికో హార్వి (Tomiko Harvey), టర్కీలోని ఇస్తాంబుల్ నుండి అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.కి వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తండ్రి మృతి చెందిన దుఃఖంలో కజకిస్తాన్ నుండి ఇంటికి తిరుగుముఖం పట్టినట్లు ఆమె తెలిపారు. విమానంలో తనకు దక్కిన నచ్చిన సీటును వదులుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. అయితే, పక్కనే కూర్చున్న ఒక మహిళ తన భర్త పక్కన కూర్చోవడానికి వీలుగా సీటు మార్చుకోవాలని కోరింది. మధ్య వరుసలో ఉన్న సీటులో ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడని హార్వి ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు.

కన్నీళ్లు – విచిత్రమైన కారణం:
హార్వి చెప్పినదాని ప్రకారం, ఆ మహిళ తన కోరిక నెరవేరకపోవడంతో సుమారు మూడు గంటల పాటు ఏడ్చింది. దానికి కారణం అడిగితే, భర్తకు దూరంగా ఉండటం బాధగా ఉందని, ఆయన భుజాలపై తల ఆన్చీ విశ్రాంతి తీసుకోలేకపోతున్నానని ఆ మహిళ చెప్పినట్లు హార్వి తన ఇన్‌స్టాగ్రామ్ పో్‌స్ట్‌లో పేర్కొన్నారు. ఆ మహిళ భర్త రెండు వరుసల ముందు కూర్చున్నాడని, అతను హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ సమయం నిద్రపోయాడని హార్వి తెలిపారు.

సోషల్ మీడియాలో చర్చ:
విమానం వాషింగ్టన్‌లో దిగిన తర్వాత, భర్త పక్కన లేకుండానే 10 గంటల ప్రయాణాన్ని ముగించిన ఆ మహిళను తాను ఎగతాళి చేసినట్లు ఆమె చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విమాన సీట్ల మార్పిడిపై పెద్ద చర్చకు దారితీసింది. భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చోవాలనుకుంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని లేదా సీట్లు ఎంచుకోవడానికి అదనపు రుసుము చెల్లించాలని నెటిజన్లు హార్వికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *