మురాదాబాద్: బంధాల్లో పవిత్రత కనుమరుగై, కామం, మోసం రాజ్యమేలుతున్నప్పుడు మానవత్వం చచ్చిపోతుంది. పవన్ ఠాకూర్ హత్యోదంతంలో అచ్చం ఇలాంటి ఘోరమే వెలుగుచూసింది. తన భర్తను చంపే క్రమంలో భార్య ఆంచల్ చూపిన క్రూరత్వం విని పోలీసులే షాక్‌కు గురయ్యారు.
ఘటన నేపథ్యం: ఆంచల్ తన భర్త పవన్‌ను అంతం చేయడానికి తన చెల్లెలు శిఖ, ప్రియుడు అంకిత్, మరియు చెల్లెలి ప్రియుడు అజయ్ దివాకర్‌లతో కలిసి పథకం వేసింది. పవన్ ఠాకూర్‌కు తన భార్యకు సొంత మేనల్లుడైన అంకిత్‌తో వివాహేతర సంబంధం ఉందని ఏడాది క్రితమే తెలిసింది. పవన్ ఎన్నిసార్లు వారించినా ఆంచల్ వినలేదు, పైగా పవన్‌ను బెదిరించేది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పవన్ మౌనంగా భరిస్తూ వచ్చాడు.
దారుణమైన హింస: గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పవన్‌ను నలుగురు నిందితులు కలిసి మంచానికి కట్టేసి, చితకబాదారు. అనంతరం ఎలక్ట్రిక్ కేబుల్ ద్వారా పవన్ ఛాతీ, చేతులు, పాదాలపై కరెంట్ షాక్ ఇచ్చారు. శరీర భాగాలు కాలినట్లు తొమ్మిది గాయాల గుర్తులు దర్యాప్తులో తేలాయి. కరెంట్ షాక్ ఇస్తుంటే పవన్ ప్రాధేయపడినా, ఆంచల్ మరియు ఆమె బృందం కనికరం చూపలేదు. అంతటితో ఆగకుండా, బలవంతంగా విషం తాగించారు. గ్లాసులోని విషం పూర్తిగా తాగే వరకు నోటి దగ్గరే పట్టుకున్నారు.
మృత్యువుతో పోరాడుతుంటే..: పవన్ విషం తాగి మరణిస్తుండగా, ఆంచల్ తన ప్రియుడితో కలిసి అపవిత్రమైన పనులకు పాల్పడటం అత్యంత హేయమైన విషయమని పోలీసులు పేర్కొన్నారు. భర్త ప్రాణాలు పోతుంటే పక్కనే రొమాన్స్ చేయడం విని పోలీసులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసుల దర్యాప్తు: మరుసటి రోజు ఆసుపత్రిలో శవాన్ని చూసి ఏడుస్తున్న ఆంచల్‌ను చూసి మొదట్లో ఎవరూ అనుమానించలేదు. కానీ, మృతదేహంపై గాయాలను గమనించిన పోలీసులు పోస్ట్‌మార్టం చేయించగా, అందులో కరెంట్ షాక్ మరియు విషప్రయోగం జరిగినట్లు తేలింది. పోలీసుల విచారణలో ఆంచల్ తన నేరాన్ని అంగీకరించింది. “ప్రియుడితో కలిసి పారిపోయేదానిని, భర్తను చంపి చాలా పెద్ద తప్పు చేశాను” అని ఆమె పోలీసుల ముందు వాపోయింది.
15 రోజుల ముందే పథకం: ఆంచల్ తన పుట్టింట్లో ఉన్నప్పుడే భర్తను ఎలా చంపాలో పథకం వేసింది. గురువారం సాయంత్రం చెల్లెలితో కలిసి తిరిగి వచ్చి, భర్తను ఫోన్ చేసి ఇంటికి పిలిపించి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రస్తుతం నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
