ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నగరంలోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లో నివసిస్తున్న విడాకుల మహిళ తన 14 ఏళ్ల కుమారుడితో ఒంటరిగా జీవిస్తోంది. అయితే ఇటీవల ఆమె ఎదుర్కొన్న భయానక అనుభవం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఓ పక్కింటివారి క్రూరత్వం
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, అదే ప్రాంతంలో నివసిస్తున్న టీ సర్వీస్‌లో పనిచేసే రియా మరియు ఆమె భర్త ఉదిత్ కలిసి ఆమెపై అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. 2024 ఏప్రిల్ 1న ఉదిత్, రియా కలిసి ఆమె ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆమె కుమారుడు పాఠశాలలో ఉండగా, ఉదిత్ ఆమెకు ఇచ్చిన టీలో మత్తు మందులు కలిపి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ ఘటనలో రియా సహకరించడమే కాకుండా, దాన్ని వీడియో తీసిందని బాధితురాలు తెలిపారు.
బెదిరింపులు, బ్లాక్‌మెయిల్
ఆ వీడియో ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు, నగలు తీసుకున్నారని తెలిపింది. 2025 జనవరి 10న ఉదిత్ వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. భయంతో బాధితురాలు రూ. 9 లక్షలు అతని ఖాతాలో బదిలీ చేసింది. అనంతరం కూడా బెదిరింపులు ఆగకపోవడంతో మొత్తం రూ. 24 లక్షలు, 25 గ్రాముల బంగారం కోల్పోయిందని ఆమె ఫిర్యాదులో తెలిపింది. వీడియోను తొలగించాలని కోరినపుడు, తన కుమారుడిని చంపేస్తానని ఉదిత్ బెదిరించాడని ఆమె పేర్కొంది.
పోలీస్ విచారణ ప్రారంభం
ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితురాలు చివరికి పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఘజియాబాద్ పోలీసులు ఉదిత్, రియాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి ఘటనలు నగరంలోని మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, హ్యుమన్ రైట్స్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
