భారతదేశంలో భాష, ఆహారం మరియు వేషధారణలే కాదు, ప్రతిరోజూ ఇంట్లో వాడే వస్తువులు కూడా మారుతూ ఉంటాయి. అందులో ముఖ్యమైనది పాలు. దేశవ్యాప్తంగా అమూల్ (Amul) ఒక నమ్మకమైన బ్రాండ్‌గా గుర్తింపు పొందినప్పటికీ, ప్రతి రాష్ట్రానికి తనదైన ప్రత్యేకమైన మరియు నమ్మకమైన పాల బ్రాండ్లు ఉన్నాయి. కొన్ని చోట్ల మదర్ డెయిరీ, మరికొన్ని చోట్ల నందిని, సుధా, సరస్ వంటి బ్రాండ్లు ఆయా రాష్ట్రాల గుర్తింపుగా మారాయి.
ఏ రాష్ట్రంలో ఏ పాల బ్రాండ్ ఫేమస్సో ఇప్పుడు చూద్దాం:
| రాష్ట్రం | ప్రసిద్ధ పాల బ్రాండ్ |
| తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | విజయ (Vijaya), హెరిటేజ్ (Heritage), సంగమ్ (Sangam) |
| కర్ణాటక | నందిని (Nandini) |
| తమిళనాడు | ఆవిన్ (Aavin) |
| కేరళ | మిల్మా (Milma) |
| గుజరాత్ | అమూల్ (Amul) |
| మహారాష్ట్ర | ఆరే (Aarey), మహానంద (Mahanand) |
| రాజస్థాన్ | సరస్ (Saras) |
| బీహార్ | సుధా (Sudha) |
| ఉత్తరప్రదేశ్ | పరాగ్ (Parag), జ్ఞాన్ (Gyan) |
| మధ్యప్రదేశ్ | సాంచి (Sanchi) |
| పంజాబ్ / హర్యానా | వెర్కా (Verka), వీటా (Vita) |
| ఒడిశా | ఓంఫెడ్ (Omfed) |
| పశ్చిమ బెంగాల్ | మదర్ డెయిరీ (Mother Dairy) |
| ఢిల్లీ | మదర్ డెయిరీ (Mother Dairy) |
