థింపు: కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో భారత్ ప్రవేశపెట్టిన E20 పెట్రోల్‌ను (20% ఇథనాల్ + 80% పెట్రోల్) తమ మిత్ర దేశమైన భూటాన్‌కు సరఫరా చేయడానికి భారత్ ముందుకొచ్చింది. అయితే, భూటాన్ ఈ ఇంధనాన్ని తీసుకోవడానికి నిరాకరించింది. దీని వెనుక ఉన్న 3 ముఖ్యమైన కారణాలు ఇవే:
- కొండ ప్రాంతాలు – వాహనాల శక్తి: భూటాన్ మొత్తం కొండ ప్రాంతాలతో నిండి ఉంటుంది. ఇక్కడ వాహనాలు ఎక్కేటప్పుడు ఇంజిన్‌కు అదనపు పవర్ (టార్క్) అవసరం. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కలిపిన పెట్రోల్ కొంచెం తక్కువ శక్తిని విడుదల చేస్తుంది, ఇది కొండ ప్రాంతాల్లో వాహనాల పనితీరుపై ప్రభావం చూపుతుందని వారు భావిస్తున్నారు.
- పాతకాలపు స్టోరేజ్ ట్యాంకులు: భూటాన్‌లోని పెట్రోల్ పంపుల్లో ఉన్న ట్యాంకులు చాలా పాతవి. వాటిలో నీరు చేరే ప్రమాదం ఉంది. E20 పెట్రోల్ తేమను, నీటిని సులభంగా పీల్చుకుంటుంది. దీనివల్ల పెట్రోల్ కలుషితమై ఇంజిన్‌కు తుప్పు పట్టే అవకాశం ఉంది.
- అధిక తేమ – మౌలిక సదుపాయాలు: భూటాన్ పర్వత ప్రాంతాల్లో ఏడాది పొడవునా తేమ ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాతావరణంలో పెట్రోల్‌ను గాలిలోని తేమ నుండి కాపాడేంత అత్యాధునిక ‘లీక్-ప్రూఫ్’ మౌలిక సదుపాయాలు ప్రస్తుతానికి భూటాన్‌లో లేవు.
అందుకే తమ దగ్గర మౌలిక సదుపాయాలు మెరుగుపడే వరకు సాధారణ పెట్రోల్‌నే సరఫరా చేయాలని భూటాన్ కోరింది.

Leave a Reply