ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. దీనికి ఇరాన్ దీటుగా సమాధానం ఇస్తోంది. ఆ క్రమంలోనే, నేడు మన దేశంతో (భారత్‌తో) ఘర్షణ పడుతున్న అజర్బైజాన్‌పై ఇరాన్ తన అత్యాధునిక డ్రోన్లతో దాడి చేసి సంచలనం సృష్టించింది. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
అమెరికా మరియు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇజ్రాయెల్‌పై నేరుగా డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేస్తూనే, మరోవైపు అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ వంటి అరబ్ దేశాలపై కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల ప్రస్తుతం మధ్యప్రాచ్యం అంతా ఉద్రిక్తతతో కనిపిస్తోంది.
అజర్బైజాన్ పై దాడి: ఇలాంటి పరిస్థితుల్లో, ఇరాన్ అకస్మాత్తుగా తన పొరుగు దేశమైన అజర్బైజాన్‌పై డ్రోన్ దాడి చేసింది. ఇరాన్ నుండి వెళ్లిన రెండు డ్రోన్లు అజర్బైజాన్‌ను తాకాయి. అందులో ఒక డ్రోన్ అజర్బైజాన్‌లోని నఖిచెవన్ (Nakhchivan) విమానాశ్రయం టెర్మినల్ భవనంపై పడగా, మరొకటి సెకెరాబాద్‌లోని ఒక పాఠశాల భవనంపై పడింది.
రాయబారికి సమన్లు: ఈ దాడుల వల్ల అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి మరియు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనతో అజర్బైజాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దాడి జరిగిన వెంటనే అజర్బైజాన్ ప్రభుత్వం ఇరాన్ రాయబారిని పిలిపించి వివరణ కోరడంతో పాటు తీవ్రంగా ఖండించింది.
దాడి వెనుక నేపథ్యం: ఇప్పటివరకు అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్, హఠాత్తుగా అజర్బైజాన్‌ను ఎందుకు కొట్టింది? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అజర్బైజాన్ దేశం ఇజ్రాయెల్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఇజ్రాయెల్ నుండి భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఈ స్నేహాన్ని ఉపయోగించుకుని, అజర్బైజాన్ భూభాగం నుండి ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ అనుమతి కోరే అవకాశం ఉంది. ఒకవేళ అజర్బైజాన్ ఇందుకు అంగీకరిస్తే అది ఇరాన్‌కు పెద్ద ముప్పుగా మారుతుంది. అందుకే అజర్బైజాన్‌ను హెచ్చరించడానికే ఇరాన్ ఈ డ్రోన్ దాడి చేసినట్లు సమాచారం.

Leave a Reply