బ్రిటన్‌కు చెందిన హెలెన్ మరియు మిక్ అనే దంపతులు భారతదేశంలో పర్యటించినప్పుడు, చెన్నైలో ఒక ఎరుపు రంగు బజాజ్ ఆటోను కొనుగోలు చేసి దానికి ‘టిమ్మీ’ అని పేరు పెట్టారు.
ఆ ఆటోలోనే గోవా, జైపూర్, ముంబై మరియు ఆగ్రా తదితర దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, 75 రోజుల్లో సుమారు 4,218 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అందరినీ అబ్బురపరిచారు.
భారత పర్యటన తర్వాత ఆ ఆటోపై ఏర్పడిన అపారమైన ప్రేమతో, దానిని వదిలి వెళ్లలేక.. సుమారు ఆరు నెలల సముద్ర ప్రయాణం ద్వారా ఆటోను ఓడలో ఏకంగా లండన్‌కే తీసుకెళ్లారు.
కానీ, లండన్ పోర్టుకు చేరుకున్న ఆ ఆటో అకస్మాత్తుగా స్టార్ట్ కాలేదని, అంతేకాకుండా బ్రిటన్ దేశ రహదారి నిబంధనల ప్రకారం పలు కఠినమైన భద్రతా పరీక్షలను (సేఫ్టీ టెస్ట్స్) ఆ ఆటో దాటాల్సి ఉందని వారు తెలిపారు.
భారతదేశ రోడ్లపై సులభంగా తిరిగిన ఆ ఆటోను లండన్ వీధుల్లో నడపడానికి అనేక చట్టపరమైన చిక్కులు, సాంకేతిక పనులు ఎదురైనప్పటికీ.. తమ ప్రయాణానికి సంబంధించిన ‘సీజన్ 2’ త్వరలోనే ప్రారంభమవుతుందని వారు ఎంతో ఉత్సాహంగా చెప్పారు.

Leave a Reply