బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో చిత్రీకరించిన పేద ప్రజల వీడియోలను.. ఢిల్లీలో తీసినవిగా చూపుతూ కొందరు చైనా ఇంటర్నెట్ సెలబ్రిటీలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
చైనాకు చెందిన మియాన్మియాన్ అనే మహిళ ఢాకా నుంచి లైవ్ స్ట్రీమ్ చేస్తూ, ఢిల్లీలోని ఇళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ తప్పుగా విమర్శించింది; మరో వ్యక్తి వాంగ్వీ ఓ టీ కొట్టులో ఆవు మూత్రం కలుపుకుని తాగుతున్నారంటూ దారుణమైన అసత్య వ్యాఖ్యలు చేశాడు.
ఈ వీడియోలు చిత్రీకరించేందుకు స్థానికులకు రోజుకు ₹500 వరకు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై ఢాకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఒక దేశాన్ని తప్పుగా చూపే ఇలాంటి చర్యలను ఏమాత్రం ఆమోదించలేమని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఇలాంటి ఫేక్ వీడియోలను వ్యాప్తి చేస్తూ భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తులపై ఆయా దేశాల అధికారులు తగిన కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ గట్టిగా కోరింది.

Leave a Reply