భారత్-EU ఒప్పందం: మద్యం ప్రియులకు బంపర్ ఆఫర్! విదేశీ బ్రాండ్ల ధరలు భారీగా పతనం.. ఆ లిస్ట్ ఇదే!

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం పార్టీ ప్రియుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తోంది. ఇప్పటివరకు విదేశీ మద్యం (Imported Liquor) కొనాలంటే ధర చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చేది. ఎందుకంటే దానిపై ఏకంగా 150 శాతం దిగుమతి సుంకం (Import Duty) ఉండేది.

కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. ఈ ఒప్పందం ప్రకారం వైన్ మరియు విస్కీలపై సుంకం 150% నుండి 40%కి తగ్గనుంది. అలాగే బీర్‌పై సుంకం 110% నుండి 50%కి పడిపోనుంది. అంటే దిగుమతి చేసుకునే మద్యం ధరలు భారీగా తగ్గడం ఖాయం.

బీర్ బాటిల్‌పై ఎంత ఆదా అవుతుంది? ఉదాహరణకు, హైనెకెన్ (Heineken) బీర్ బాటిల్ ధర గతంలో ₹3,000 ఉండేదనుకుంటే, అందులో సగానికి పైగా ట్యాక్సులకే పోయేది. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం అదే బాటిల్ మీకు సుమారు ₹2,000కే లభించవచ్చు. అంటే నేరుగా ₹1,000 ఆదా అవుతుంది! నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్ నుండి వచ్చే ప్రసిద్ధ బీర్లు ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తాయి.

వోడ్కా, వైన్ ప్రియులకు పండగే! బీర్ మాత్రమే కాదు, స్వీడన్ ప్రసిద్ధ అబ్సొలట్ వోడ్కా (Absolut Vodka) బాటిల్ ధర కూడా తగ్గనుంది. గతంలో ₹4,000 ఉన్న బాటిల్ ఇకపై ₹2,500 నుండి ₹3,000కే దొరకవచ్చు. అలాగే ఫ్రాన్స్ వైన్ ₹2,000 నుండి ₹1,200కి తగ్గే అవకాశం ఉంది. దశలవారీగా ఈ ధరలు ఇంకా తగ్గుతాయనేది ఆసక్తికరమైన విషయం.

ఏయే బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయి? యూరప్‌లోని 27 దేశాలు మద్యం ఉత్పత్తిలో టాప్. ఇకపై భారతీయ బార్లలో బెల్జియంకు చెందిన ‘స్టెల్లా’, ఐర్లాండ్ ‘గిన్నిస్’, ఫ్రాన్స్‌కు చెందిన ‘మొయెట్ షాంపైన్’ బాటిళ్లు సందడి చేయనున్నాయి. ధరలు తగ్గితే వీటి అమ్మకాలు రెట్టింపు అవ్వడం ఖాయం.

స్థానిక బ్రాండ్లకు సవాలు: విదేశీ బ్రాండ్ల ధరలు తగ్గితే కింగ్‌ఫిషర్ వంటి మన దేశీయ బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురవుతుంది. నాణ్యత మరియు ధర విషయంలో గ్లోబల్ కంపెనీలతో పోటీ పడాల్సి ఉంటుంది.


Posted

in

by

Tags: