“భారత జనాభా 150 కోట్లకు చేరువవుతోందా.? ఎయిమ్స్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా దృష్టి ఆకర్షించిన డిజిటల్ బోర్డు.! చూపించిన 148 కోట్ల లెక్క.. వైరల్ అవుతున్న వీడియోతో తీవ్ర చర్చ.!!”

భారతదేశ జనాభా వేగంగా పెరుగుతుండటం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రి ఆవరణలో భారతదేశ జనాభాను అంచనా వేసే ఓ డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసినట్లు చూపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో భారతదేశ జనాభా సుమారు 148 కోట్లు దాటినట్లుగా చూపుతుండటం పలువురి దృష్టిని ఆకర్షించింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో, నవంబర్ 10వ తేదీ రాత్రి 7.27 గంటలకు భారతదేశ జనాభా 1,48,16,37,145 గా చూపించినట్లు చెబుతున్నారు. అంటే సుమారు 148.16 కోట్ల మంది అన్నమాట. అసలు ఈ సంఖ్యను ఎక్కడి నుంచి సేకరించారు, ఇది నిజంగా లైవ్ జనాభా లెక్కేనా అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఈ చర్చల మధ్య, యశ్ అనే ఓ సోషల్ మీడియా యూజర్.. ఆ డిజిటల్ బోర్డులో చూపించిన జనాభా వివరాలను సరిచూసేందుకు ‘గ్రోక్’ (Grok) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్‌ను అడిగాడు. దానికి బదులిచ్చిన గ్రోక్.. నవంబర్ 10వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ బోర్డులో సుమారు 148.16 కోట్ల జనాభా చూపించిన మాట వాస్తవమేనని తెలిపింది. అంతేకాకుండా, ఈ సంఖ్య ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాలతో దాదాపు సరిపోలుతోందని కూడా పేర్కొంది.

అయినప్పటికీ, డిజిటల్ బోర్డులో చూపించే సంఖ్యను భారతదేశపు కచ్చితమైన లైవ్ జనాభా లెక్కగా పరిగణించలేము. జనాభా అంచనాలను జననాలు, మరణాలు, ఇతర గణాంకాల ఆధారంగా లెక్కిస్తారు. ఏది ఏమైనా, భారతదేశం 150 కోట్లకు చేరువవుతోందా అనే చర్చను ఈ వీడియో మళ్లీ తెరపైకి తెచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *