మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బాదిన భారీ సిక్సర్, ఆ సందర్భంగా మైదానంలో చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతున్నాయి.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన సాధారణ ఫుల్ టాస్ బంతిని హర్మన్‌ప్రీత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాదేశారు. బంతి వేగాన్ని, ఎత్తును సరిగ్గా అంచనా వేసిన ఆమె ముందుకు వచ్చి, తన పూర్తి శక్తిని ఉపయోగించి డీప్ మిడ్-వికెట్ దిశగా భారీ సిక్సర్‌గా మలిచారు. ఈ పవర్ఫుల్ షాట్ మైదానంలోని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినప్పటికీ, చివరకు హర్మన్‌ప్రీత్ 28 బంతుల్లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
హర్మన్‌ప్రీత్ బాదిన ఈ భారీ సిక్సర్ కేవలం పరుగులతోనే ముగియలేదు; బౌండరీ లైన్ వద్ద అనూహ్య ఘటనకు కారణమైంది. బంతి గాల్లో దూసుకొచ్చిన దిశలోనే విధుల్లో ఉన్న ఓ భద్రతా సిబ్బంది నడుచుకుంటూ వెళ్తున్నారు. అకస్మాత్తుగా బంతి నేరుగా తన తలవైపే దూసుకురావడాన్ని గమనించిన ఆయన.. ప్రమాదాన్ని క్షణాల్లో గ్రహించి నేలపైకి ఠక్కున వంగిపోయారు.
ఆయనకు అతి సమీపంలోనే బంతి బౌండరీ అవతల పడిన ఆ క్షణంలో, ఆ సిబ్బంది ప్రదర్శించిన మెరుపు ప్రతిస్పందన స్టేడియంలో కాసేపు ఉత్కంఠను, ఆ వెంటనే నవ్వులను పూయించింది. హర్మన్‌ప్రీత్ పవర్ఫుల్ సిక్సర్ కంటే కూడా.. ఆ భద్రతా అధికారి క్షణాల వ్యవధిలో తప్పించుకున్న తీరే ఇప్పుడు క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ నెట్టింట ట్రెండ్ అవుతోంది.
