అనుమానం అనేది ఏ బంధాన్ని అయినా నాశనం చేయగలదు. నమ్మకం లేని చోట అనుమానం పెరిగితే, మనిషి తన చేతులతోనే తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాడు. తెలంగాణలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అనుమానం, కోపంతో ఊగిపోయిన ఒక భర్త అత్యంత కిరాతకంగా తన భార్యను చంపేశాడు.
భార్యకు మరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భర్త, ఆమెను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం, ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలో జరిగింది. నిందితుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, అతని భార్య ఒక కో-ఆపరేటివ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవని అధికారులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం జరిగిన గొడవలో, కోపంతో ఊగిపోయిన నిందితుడు తన భార్యపై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మరణించింది. అమీన్పూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, మరొక ఘటనలో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ భార్య దీప్తి, తన భర్త చేస్తున్న మోసాన్ని బయటపెట్టింది.
