భార్యను చంపి, భారతీయ ప్రియురాలికి ఫోటోలు పంపిన అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. పోలీసులకు చిక్కింది ఎలా?

వాషింగ్టన్: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఒక యువకుడు, తన వివాహేతర సంబంధం కోసం పెళ్లైన నాలుగు నెలలకే భార్యను గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత నాటకం ఆడాడు. భార్య చనిపోయిన ఫోటోలను తన ప్రియురాలికి పంపిన ఈ నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: తెలంగాణకు చెందిన అవినాష్ నార్నే (30) అమెరికాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి రాజితా సప్పినేని (27)తో వివాహం జరిగి నాలుగు నెలలయ్యింది. 2025 అక్టోబర్ 27న అవినాష్ బెల్లీవ్ పోలీసులకు ఫోన్ చేసి, ఏడుస్తూ “పని నిమిత్తం బయటకు వెళ్లి 40 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాను. నా భార్య టాయిలెట్ గదిలోకి వెళ్లి తలుపులు గడియ పెట్టుకుంది. ఎంత పిలిచినా పలకడం లేదు” అని చెప్పాడు.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూడగా, రాజితా సప్పినేని విగతజీవిగా పడి ఉంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె హత్యకు గురైందని, గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే మరణించిందని వెల్లడైంది. దీనితో పోలీసులకు అనుమానం వచ్చి అవినాష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజాలు బయటపడ్డాయి.

విచారణలో అవినాష్ తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్ళికి ముందే భారతదేశంలో ఉన్న ఒక మహిళతో అతనికి వివాహేతర సంబంధం ఉంది. కుటుంబ సభ్యులు రాజితతో వివాహం జరిపించినా, ఆ మహిళతో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆమెను పెళ్లి చేసుకుని కలిసి జీవించాలనే ఉద్దేశంతోనే, భార్య రాజితను ప్లాన్ ప్రకారమే హత్య చేశాడు. భార్యను చంపిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఫోటో తీసి, తన ప్రియురాలికి పంపాడని విచారణలో తేలింది. ప్రస్తుతం అవినాష్ అదుపులో ఉన్నాడు. కోర్టులో నేరం రుజువైతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: