“భార్య కోసం ఇలా కూడా చేస్తారా..?” పక్కింటి ఫంక్షన్‌కు పిలవకపోతే ఏంటి..?” భార్య అడిగిన ఫుడ్‌ను చాలా కూల్‌గా తీసుకొచ్చిన భర్త.. నెటిజన్లను నవ్విస్తున్న క్యూట్ వీడియో..!!

పక్కింట్లో జరిగే వేడుకకు తమను పిలవకపోయినా, అక్కడ వండుతున్న రుచికరమైన ఆహారాన్ని తినాలని భార్య ముచ్చటపడటంతో, భర్త చేసిన పని ఇంటర్నెట్‌లో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

‘రామే ధిల్లాన్’ అనే యూజర్ షేర్ చేసిన వీడియోలో, తన భార్యతో కలిసి బాల్కనీలో నిల్చున్న భర్తను.. పక్కింటి ఫంక్షన్ నుంచి నాలుగు రొట్టెలు తీసుకురావాలని భార్య కోరుతుంది. భార్య కోరికను తీర్చేందుకు ఆ ప్రేమగల భర్త అంగీకరించి వెంటనే బయలుదేరుతాడు.

ఫంక్షన్ జరుగుతున్న టెంట్ వద్దకు వెళ్లిన అతను, అక్కడున్న వంటవాళ్లతో నవ్వుతూ మాట్లాడి రొట్టెలను అడిగి తీసుకుంటాడు. ఆ తర్వాత సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి తాను తెచ్చిన పార్శిల్‌ను ఓపెన్ చేస్తాడు.

అందులో భార్య అడిగిన నాలుగు తందూరీ రొట్టెలతో పాటు, అదనంగా మరో మిస్సీ రోటీ కూడా ఉండటం భార్యకు, నెటిజన్లకు భలే ఆశ్చర్యాన్ని కలిగించింది. భర్త చేసిన ఈ తెలివైన, ఆసక్తికరమైన పనిని చూసి భార్య మురిసిపోయింది.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, “ఈరోజు వంట చేసే పని తప్పిందన్నమాట” అని కొందరు, “భార్య కోసం ఇలాంటి పనులు చేయడంలో ఓ ప్రత్యేకమైన ఆనందం ఉంది” అని మరికొందరు నెటిజన్లు తమ కామెంట్లను పంచుకుంటున్నారు.

https://www.instagram.com/reel/DeD5vvoTo-G/?utm_source=ig_embed&utm_campaign=loading

Posted

in

by

Tags: