భార్య మిగిల్చిన ఆహారమే తింటూ.. రాత్రింబవళ్లు భార్య కోసం కష్టపడుతున్న భర్త!

భార్య ప్రాణాలను కాపాడేందుకు పోరాటం.. వియత్నాంలో హృదయాన్ని కదిలిస్తున్న నిజమైన ప్రేమకథ!

వియత్నాంకు చెందిన 29 ఏళ్ల యువకుడు తన ప్రాణంగా ప్రేమించిన 24 ఏళ్ల తో అనే యువతిని వివాహం చేసుకున్నాడు.

అయితే పెళ్లయిన కొంతకాలానికే అతని భార్యకు తీవ్రమైన ఊపిరితిత్తుల క్షయవ్యాధి (టీబీ) సోకింది. దీంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, చివరకు మంచానికే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.

అయినా భర్త మాత్రం ఏమాత్రం నిరుత్సాహపడలేదు. భార్యను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకుండా రాత్రింబవళ్లు ఆమెకు సేవలు చేస్తూ, వైద్య చికిత్స అందిస్తూ అండగా నిలుస్తున్నాడు.

భార్య తినగా మిగిలిపోయిన ఆహారాన్ని కూడా తానే తింటున్నట్లు కథనంలో పేర్కొన్నారు. భార్య చికిత్స కోసం తన వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు చేసిన అతను, ఇప్పుడు ఆమె ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో విరాళాలు సేకరిస్తున్నాడు.

ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వారి జీవితాన్ని తీవ్రంగా పరీక్షిస్తున్నప్పటికీ, భార్యపై భర్తకు ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుతున్న ఈ భర్త కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను ఈ ఘటన కదిలిస్తోంది.

సుఖంలో తోడుగా ఉండటం మాత్రమే ప్రేమ కాదు.. కష్టాల్లోనూ చేయి వదలకుండా అండగా నిలవడమే నిజమైన ప్రేమకు నిదర్శనం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *