మంచానికే పరిమితమైన దివ్యాంగురాలైన కుమార్తె.. సీసీ కెమెరా పెట్టిన తల్లికి షాక్: ఆ దృశ్యం చూసి నిర్ఘాంతపోయిన మహిళ.. భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు!

‘రెట్ సిండ్రోమ్’ (Rett syndrome) అనే అరుదైన నాడీ సంబంధిత రుగ్మతతో బాధపడుతున్న దివ్యాంగురాలైన యువతి ఆష్లే. శారీరకంగా, మానసికంగా చిన్నపిల్లలాగే ఉండే ఆమెకు వచ్చే ఫిట్స్ (మూర్ఛ వ్యాధి) తీవ్రతను గమనించేందుకు, ఆమె తల్లి పౌలా విజిల్‌ కుమార్తె పడకగదిలో ఒక సీసీ కెమెరాను అమర్చారు.

ఒకరోజు ఆ కెమెరా ఫుటేజీని పరిశీలించి చూసినప్పుడు, పౌలా భర్త బ్రియాన్ కెన్నెత్ అర్బన్, ఆష్లేపై లైంగిక దాడికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన తల్లి, వెంటనే పోలీసులను ఆశ్రయించి వీడియో ఆధారాలను అందజేశారు.

దీంతో పోలీసులు బ్రియాన్‌ను అరెస్ట్ చేసి, అతనిపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం అతనికి 1 నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. అత్యంత హృదయ విదారకమైన విషయమేమిటంటే, ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆష్లే నిద్రలోనే కన్నుమూసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *