మద్యం మత్తులో తూలుతున్న గర్ల్‌ఫ్రెండ్‌ను తన భుజాలపై ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఒక యువకుడు. అయితే, ఇంటి తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న తండ్రిని చూసి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. తండ్రి కోపంతో రగిలిపోతూ చూడటంతో, ఆ అబ్బాయి భయపడి క్షణాల్లో ఆ అమ్మాయిని బెడ్‌రూమ్‌లో పడేసి అక్కడి నుండి పరారయ్యాడు.
వీడియోలో ఏం జరిగింది? వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి మద్యం మత్తులో తన కాళ్లపై తాను నిలబడలేనంతగా తూలిపోతుండటం కనిపిస్తుంది. ఆమె ప్రియుడు ఆమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకువస్తాడు. ఆమె నడవలేకపోవడంతో అతడు ఆమెను ఎత్తుకుని లోపలికి వెళ్లడానికి తలుపు తీస్తాడు. కానీ ఎదురుగా తండ్రిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆగ్రహంతో ఊగిపోతున్న తండ్రి చూపులకు భయపడిన ఆ అబ్బాయి, వెంటనే ఆ అమ్మాయిని లోపల పడుకోబెట్టి, ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా గప్‌చుప్‌గా అక్కడి నుండి పారిపోతాడు.
నెటిజన్ల రియాక్షన్: ఈ వీడియో @MenTooHuman అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా నుండి షేర్ చేయబడింది. దీనికి లక్షలాది వ్యూస్, వేలాది కామెంట్స్ వస్తున్నాయి. “తమ్ముడూ బాగా బుక్కయ్యావుగా!” అని ఒకరు, “ఇది పక్కా స్క్రిప్టెడ్ వీడియో (ముందుగా ప్లాన్ చేసి తీసింది)” అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.
