మత్తులో మృగం.. కన్నతల్లిని, భార్యను చంపి మాంసం తిన్న కిరాతకుడు! కుషీనగర్‌లో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన

మద్యం, గంజాయి మత్తు తలకెక్కితే ఒక కుటుంబం ఎలా నాశనమవుతుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కుషీనగర్‌కు చెందిన సికందర్ గుప్తా (30) అనే వ్యక్తి, ముంబైలో పని చేసి నెల రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతను మద్యానికి, గంజాయికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడు.

ఘోరం జరిగిన తీరు: సోమవారం సాయంత్రం బాగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన సికందర్, భార్య ప్రియంక (28)తో గొడవకు దిగాడు. తల్లి రూనా దేవి వారిని వారించేందుకు ప్రయత్నించగా, కోపంతో ఊగిపోయిన సికందర్ రోడ్డుపై ఉన్న సిమెంట్ ఇటుకతో ఇద్దరి తలలపై బలంగా బాదాడు. తీవ్ర గాయాలతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

స్థానికుల దిగ్భ్రాంతి: అరుపులు ఆగిపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, అక్కడ ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. సికందర్ తన తల్లి, భార్య మృతదేహాల పక్కన కూర్చుని, వారి శరీరం నుండి మాంసం తీసి తింటున్నట్లు సమాచారం. ఇది చూసి భయపడిన జనం కేకలు వేస్తూ పరుగులు తీశారు. వారిని కూడా సికందర్ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి అతడిని చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.


Posted

in

by

Tags: