“మద్యం దుకాణంలో కలకలం”. క్షణాల్లో కుప్పకూలి 39 ఏళ్ల ఉద్యోగి మృతి. ఛాతీలో దూసుకెళ్లిన మేకు. హడావుడిగా పారిపోయిన వ్యక్తి. ఈ అనుమానాస్పద మృతి వెనుక అసలు కారణం ఏంటి.? వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!!

మహారాష్ట్రలోని నాసిక్ సిడ్కో ప్రాంతంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న 39 ఏళ్ల ఉద్యోగి ఛాతీలో అకస్మాత్తుగా ఓ మేకు దూసుకెళ్లడంతో దారుణంగా మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

మృతుడిని సునీల్ అనిల్ తాయ్డేగా గుర్తించారు. స్టేట్ బ్యాంక్ చౌక్ సమీపంలోని మద్యం దుకాణంలో సోమవారం సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విడుదలై తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. నలుపు రంగు టీ-షర్ట్ ధరించిన సునీల్ దుకాణం కౌంటర్ వద్ద నిలబడి ఉండగా, మరో వ్యక్తి దుకాణం వైపు వస్తాడు. తర్వాతి కొద్ది క్షణాల్లోనే సునీల్ అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోతాడు; అదే సమయంలో వచ్చిన ఆ వ్యక్తి హడావుడిగా దుకాణం నుంచి బయటకు వెళ్లిపోతాడు. మొదట్లో దుకాణంలో ఉన్నవారికి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు.

ఆ తర్వాత, తోటి ఉద్యోగులు వెంటనే సునీల్‌ను రక్షించి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేరిన అతడు, అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్లైవుడ్ పనుల్లో వాడే టూల్స్ (నెయిల్ గన్)లో ఉపయోగించే ఒక ఇనుప మేకు సునీల్ ఛాతీలోకి బలంగా దూసుకెళ్లడమే అతని మరణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

అయితే, కౌంటర్ వద్ద నిలబడి ఉన్న సునీల్ ఛాతీలోకి ఆ మేకు ఎలా దూసుకెళ్లింది, పారిపోయిన వ్యక్తికి దీనికి ఉన్న సంబంధం ఏమిటి అనే కోణంలో అంబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ మేకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *