తమిళనాడు విల్లుపురంలో భవన నిర్మాణ కార్మికుడైన బాబు (46) తన భార్య రాజలక్ష్మి మరియు ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. చిన్న కుమార్తె వైష్ణవి (17) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్లస్-2 (ఇంటర్మీడియట్) చదువుతోంది.
అసలేం జరిగింది?
- చిన్న కారణం: గత డిసెంబర్ 17న బాబు విపరీతంగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో వైష్ణవి ఒక్కటే ఉంది. ఆకలిగా ఉందని, అన్నం వడ్డించమని తండ్రి అడగగా.. “అన్నం ఇంకా వండలేదు” అని వైష్ణవి సమాధానం ఇచ్చింది.
- కృరమైన దాడి: ఆ చిన్న మాటకే కోపంతో ఊగిపోయిన బాబు, కన్నకూతురు అని కూడా చూడకుండా ఆమెపై దాడికి దిగాడు. ఆమె జుట్టు పట్టుకుని లాగి, తలను గోడకు బలంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా కిందపడేసి కాళ్లతో ఇష్టమొచ్చినట్లు తన్నాడు.
- ఆసుపత్రిలో మృతి: వైష్ణవి అరుపులు విని స్థానికులు వచ్చి ఆమెను కాపాడి విలుప్పురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో 26 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వైష్ణవి, నిన్న ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూసింది.
పోలీసుల చర్య:
వైష్ణవి తల్లి రాజలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత ‘హత్యాయత్నం’ కేసు నమోదు చేసి బాబును అరెస్ట్ చేశారు. అయితే, బాలిక మరణించడంతో ఈ కేసును ఇప్పుడు ‘హత్య కేసు’ (Murder Case) గా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం జైలులో ఉన్నాడు.
