ఈరోడ్ జిల్లా కవుందప్పాడికి చెందిన 16 ఏళ్ల ఇంటర్ ప్రథమ సంవత్సరం (ప్లస్-1) విద్యార్థినిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన సేలం జిల్లాకు చెందిన సెల్వరాజ్ (24) అనే యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈరోడ్ మహిళా కోర్టు తీర్పు వెలువరించింది.
2025లో క్యాటరింగ్ పనుల కోసం వచ్చిన సమయంలో ఆ బాలికతో పరిచయం పెంచుకున్న ఇతడు.. విహారయాత్రకు తీసుకెళ్తానని నమ్మబలికి కొల్లిమలై ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కవుందప్పాడి పోలీసులు, కొల్లిమలైలో ఉన్న బాలికను రక్షించి, సెల్వరాజ్‌ను పోక్సో (POCSO) చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈరోడ్ మహిళా కోర్టులో నడిచిన ఈ కేసులో, నిందితుడు సెల్వరాజ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి సి. స్వర్ణకుమార్ తీర్పునిచ్చారు. అంతేకాకుండా, బాధితురాలికి తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.

Leave a Reply