మనస్సాక్షి లేదా..? “వాహనం బోల్తా పడి ఘోర ప్రమాదం”.. ఒక్కరికి కూడా సాయం చేయాలనిపించలేదు.. నడిరోడ్డుపై ఒలికిన పాలను పోటీపడి మరీ పట్టుకెళ్లిన జనం. అసహ్యం పుట్టించే వీడియో.!!!

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహాను తాలూకాలోని ఓ గ్రామం సమీపంలో, ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాలు తీసుకెళ్తున్న ఒక ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడి ప్రమాదానికి గురైంది.

సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ముంబై వైపు వెళ్తున్న ట్యాంకర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై బోల్తా పడిందని ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, మరెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ట్యాంకర్ బోల్తా పడగానే అందులోని పాలు రోడ్డుపై పెద్ద ఎత్తున ఒలికిపోయాయి. హైవేపై పాలు పారడాన్ని చూసిన వాహనదారులు చాలా మంది తమ వాహనాలను ఆపి అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఘటనా స్థలానికి పోటెత్తారు. కొందరు బాటిళ్లు, బకెట్లు తదితర పాత్రలు తెచ్చుకుని రోడ్డుపై ఒలికిన పాలను తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ప్రమాదం జరిగిన చోట ఒక్కసారిగా జనసందోహం పెరిగింది.

మరోవైపు, ట్యాంకర్ బోల్తా పడటంతో ముంబై వైపు వెళ్లే మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కార్లు, లారీలు సహా పలు వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత దెబ్బతిన్న ట్యాంకర్‌ను రోడ్డుపై నుంచి తొలగించడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంది.

ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ నియంత్రణ ఎందుకు కోల్పోయాడు, ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేయడం మానేసి, రోడ్డుపై ఒలికిన పాలను పట్టుకెళ్లేందుకు ప్రజలు ఎగబడిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *