మనిషివేనా నువ్వు అసలు.! “ఎలాగైనా ధనవంతుడిని కావాలి”.. ఆన్‌లైన్‌లో వెతికినందుకు పుట్టిన విపరీత ఆలోచన.. 4 ఏళ్ల బాలుడిని చంపి కిడ్నీలు, ఊపిరితిత్తులు, కళ్లను ప్లాస్టిక్ బకెట్‌లో దాచిన కిరాతకుడు.. తీవ్ర కలకలం..!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జష్‌పూర్ జిల్లాకు చెందిన వాసుదేవ్ (వయసు 27) అనే యువకుడు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం ఎలా అని సోషల్ మీడియాలో నిరంతరం వెతుకుతూ ఉండేవాడు.

దినసరి కూలీగా పనిచేస్తే వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో, చిన్న పిల్లల శరీర అవయవాలను తీసి ఆన్‌లైన్‌లో అమ్మి డబ్బు సంపాదించాలనే దారుణమైన ఆలోచన అతనికి పుట్టింది.

ఈ క్రమంలో, గత నవంబర్ 5వ తేదీన తన బంధువుల 4 ఏళ్ల మగబిడ్డను మాయమాటలు చెప్పి తన వెంట తీసుకెళ్లాడు. పిల్లాడికి మద్యం తాగించి మత్తులోకి దించిన తర్వాత, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆ బాలుడి కిడ్నీలు, ఊపిరితిత్తులు, కళ్లను కోసి బయటకు తీసి ఒక ప్లాస్టిక్ బకెట్‌లో భద్రపరిచాడు.

బాలుడి మృతదేహాన్ని దుప్పటితో చుట్టి, ఒక గోనెసంచిలో కుక్కి వ్యవసాయ పొలం దగ్గరున్న నీటి గుంటలో పూడ్చిపెట్టాడు. తన బిడ్డ అదృశ్యమైనట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సన్నా పోలీసులు, ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి గోనెసంచిలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.

అనుమానం నేపథ్యంలో వాసుదేవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఆన్‌లైన్‌లో శరీర అవయవాలను విక్రయించేందుకు పథకం పన్ని ఈ హత్యకు పాల్పడినట్లు తన నేరాన్ని అంగీకరించాడు. వెంటనే అతడిని అరెస్టు చేసిన పోలీసులు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను, అవయవాలు దాచిన ప్లాస్టిక్ బకెట్‌ను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *