“మనుషులకే తాగడానికి నీళ్లు లేవు సార్. ఇక పశువులకు ఎక్కడి నుంచి తేవాలి?”.. క్యూలో నిలబడి కన్నీరుమున్నీరవుతున్న ప్రజలు. ప్రభుత్వ ట్యాంకర్ల కోసం ఆందోళన..!!!

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో సాధారణం కంటే కేవలం 30 శాతం వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో, ఇప్పట్నుంచే అక్కడ నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోంది.

చాకూర్ తాలూకా పరిధిలోని వడ్వాల్ నాగనాథ్ గ్రామంలో సుమారు 11,000 మంది నివసిస్తుండగా, అక్కడి బావులు, బోరుబావులు వేగంగా ఎండిపోతున్నాయి.

దీని కారణంగా ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నా, ఒక్కో వ్యక్తికి కేవలం 5 కుండల నీళ్లు మాత్రమే దొరికే దుస్థితి నెలకొంది. వేసవి కాలం ప్రారంభం కావడానికి ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ, గ్రామంలో తాగడానికి నీరు కూడా దొరకనంతగా తీవ్ర కరువు తాండవిస్తోంది.

మనుషుల కనీస అవసరాలకే నీరు సరిపోకపోవడంతో, ఇళ్లలో పెంచుకునే పశువులకు తాగునీరు అందించలేక రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దీంతో వేరే దారిలేక, తమ కుటుంబ సభ్యుల్లా పెంచుకున్న ఆవులు, మేకలను అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దయనీయ స్థితికి రైతులు నెట్టబడ్డారు.

నీటి ట్యాంకులకు, బావులకు నీటిని సరఫరా చేసే జలాధారాలు ఎండిపోవడంతో, గ్రామంలో నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితిని ప్రభుత్వ అధికారులు వెంటనే స్వయంగా వచ్చి పరిశీలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అంతేకాకుండా, ప్రభుత్వం వెంటనే ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోకపోతే, రాబోయే వేసవిలో ఈ గ్రామం మొత్తం నివాసయోగ్యంగా లేకుండా పోతుందని స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Posted

in

by

Tags: