ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా చాంద్‌పూర్ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద ఒక్కసారిగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఓ వ్యక్తి తన భార్యను మరో యువకుడితో కలిసి చూసి ఆగ్రహంతో గొడవకు దిగడంతో అక్కడ భారీగా జనం గుమిగూడారు.
సమాచారం ప్రకారం.. షోయబ్‌కు తన భార్య అలీనా ప్రవర్తనపై కొంతకాలంగా అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అలీనా.. అర్బన్ నహివాల్ అనే యువకుడితో కలిసి చాంద్‌పూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు షోయబ్‌కు సమాచారం అందింది.
వెంటనే హోటల్ వద్దకు చేరుకున్న షోయబ్.. భార్యతో పాటు ఆ యువకుడు గది నుంచి బయటకు వచ్చే వరకు అక్కడే వేచి ఉన్నాడు. వారు బయటకు వచ్చిన వెంటనే ఇద్దరినీ అడ్డుకుని తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
ఈ క్రమంలో తన భార్యపై అనుచిత కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ షోయబ్ బహిరంగంగా ఆరోపించడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
గొడవను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షోయబ్, అలీనా, అర్బన్ నహివాల్ ముగ్గురినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు.
అయితే పోలీసుల విచారణలో అలీనా తన భర్త ఆరోపణలను పూర్తిగా ఖండించింది.
“అర్బన్ నహివాల్ నా స్నేహితుడు మాత్రమే. మేమిద్దరం కేవలం సరదాగా బయటకు వచ్చాం. హోటల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో నా భర్త అనవసరంగా మమ్మల్ని అడ్డుకుని గొడవ చేస్తున్నారు” అని పోలీసులకు ఆమె వివరించినట్లు సమాచారం.
మరోవైపు షోయబ్ మాత్రం తన ఆరోపణలపై వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
దీంతో పోలీసులు హోటల్ రిజిస్టర్ వివరాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇరువర్గాల వాంగ్మూలాలను నమోదు చేసుకుని అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనతో చాంద్‌పూర్ ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply