బరేలీ (ఉత్తరప్రదేశ్): ఒక లగ్జరీ హోటల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా, కూర్చునే సీటు విషయంలో తలెత్తిన వివాదం ఒక మహిళపై బీర్ బాటిల్‌తో దాడి చేసే వరకు దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఏం జరిగిందంటే?
మహక్ గుప్తా అనే మహిళ తన సోదరుడితో కలిసి క్రిస్మస్ వేడుకల కోసం ఒక హోటల్‌కు వెళ్లారు. అక్కడ టేబుల్ కేటాయింపు విషయంలో మరో బృందంతో వారికి వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు మహక్ గుప్తాని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఒక్కసారిగా బీర్ బాటిల్‌తో ఆమె తలపై బలంగా కొట్టారు.
దీంతో ఆ మహిళ తలకు తీవ్ర గాయమై రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి సంబంధించి షైనిత్ శ్రీవాస్తవ, సలోని పటేల్‌తో సహా ఆరుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హోటల్ సిబ్బందిపై ఆరోపణలు:
దాడి జరుగుతున్న సమయంలో హోటల్లోని భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని, నిందితులు అక్కడి నుండి తప్పించుకోవడానికి సహకరించారని బాధితురాలు ఆరోపించారు. పోలీసులు హోటల్లోని సిసిటివి (CCTV) ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
