టోక్యో: నిశ్శబ్దానికి, క్రమశిక్షణకు మారుపేరైన జపాన్ దేశం ఇప్పుడు అశాంతితో రగిలిపోతోంది. ఆ దేశ తీరప్రాంత నగరం ‘ఫుజిసావా’ ప్రస్తుతం ఒక భారీ జాతీయ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. నగరంలో తొలి మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది జపనీస్ పౌరులు రోడ్లపైకి వచ్చి చేసిన నిరసనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి.
చారిత్రక కట్టడాల కంటే పెద్దదా? ప్రజల ఆగ్రహం!
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’ లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఈ నిరసన కేవలం ఒక ప్రాంతానికో, కొద్దిమందికో పరిమితం కాలేదు. వేలాది మంది ప్రజలు ప్లకార్డులు పట్టుకుని మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా నినదించారు. జపాన్ వారసత్వానికి ప్రతీకలైన ప్రాచీన ‘షింటో’ దేవాలయాల కంటే భారీ ఎత్తున ఈ మసీదును నిర్మించ తలపెట్టడం తమ సంస్కృతిని రెచ్చగొట్టడమేనని స్థానికులు మండిపడుతున్నారు.
అజాన్ శబ్దాలు.. వింతైన అంత్యక్రియలు:
కేవలం కట్టడమే కాదు, మసీదు నుండి వచ్చే ‘అజాన్’ (ప్రార్థన పిలుపు) శబ్దాల వల్ల కలిగే శబ్ద కాలుష్యం, అలాగే జపాన్ సంప్రదాయాలకు భిన్నంగా ఉండే ముస్లింల అంత్యక్రియల ఆచారాలపై కూడా స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జరిగిన బహిరంగ చర్చా సమావేశాలు రసాభాసగా మారడంతో, పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
తమ జనాభా ప్రాబల్యాన్ని నెమ్మదిగా పెంచుకుంటూ, దేశ అస్తిత్వాన్నే మార్చేసే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ప్రపంచవ్యాప్త చర్చ.. భారత్, లండన్ ప్రస్తావన!
ఈ వివాదంపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు స్పందిస్తున్నారు. జపాన్ తన సంస్కృతిని కాపాడుకోవడంలో చూపుతున్న కఠిన వైఖరిని పలువురు సమర్థిస్తున్నారు.
- “ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. భారత్, లండన్ వంటి నగరాల ప్రస్తుత పరిస్థితిని చూసి జపాన్ పాఠాలు నేర్చుకోవాలి” అని ఒక నెటిజన్ హెచ్చరించారు.
- “జపాన్ లాంటి దేశంలో అనుమతులు అంత త్వరగా ఎలా వచ్చాయి?” అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
- భారత్ లోని హిందువులు కూడా ఈ ‘డెమోగ్రాఫిక్ మార్పుల’ (జనాభా మార్పిడి) పట్ల అప్రమత్తంగా ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.
“మేం నియమాలకు కట్టుబడి ఉంటాం”: ముస్లిం ప్రతినిధులు
మరోవైపు ‘ఫుజిసావా మసీదు’ ప్రతినిధులు స్థానికులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. “మాకు జపాన్ అంటే ఇష్టం. మేము ఇక్కడి చట్టాలకు, నియమాలకు లోబడే ఉంటాం” అని వారు చెబుతున్నప్పటికీ, స్థానిక జపనీయులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ భూమి, తమ సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ పోరాటం సాగుతోంది.
