“మా మీద చెయ్యేస్తే మొత్తం సైన్యం దిగుతుంది..!” సౌదీ, పాకిస్థాన్, టర్కీలతో చేతులు కలుపుతున్న సిరియా.. ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరిక.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే..??

పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాల మధ్య కుదిరిన ‘మక్కా భద్రతా ఒప్పందం’లో సిరియా కూడా చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆశ్చర్యకరమైన వార్తలు వెలువడుతున్నాయి.

ఈ చారిత్రాత్మక భద్రతా ఒప్పందం ప్రకారం, ఇందులో ఉన్న ఏదేని ఒక దేశంపై దాడి జరిగితే, అది ఒప్పందంలోని సభ్య దేశాలన్నింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.

ఇప్పటివరకు ఈ ఒప్పందంలో చేరే విషయమై సిరియా ప్రభుత్వం బహిరంగంగా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఈ మేరకు సిరియా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.

మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు, అభద్రతాభావం పెరుగుతున్న పరిస్థితుల్లో, సిరియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ దేశాల్లో తీవ్ర ఆసక్తిని, చర్చను రేకెత్తిస్తోంది.

ఈ కీలక దేశాలన్నీ ఏకమై ఒక కొత్త భద్రతా కూటమిని ఏర్పాటు చేయడం వల్ల, ఆ ప్రాంతంలో భారీ స్థాయిలో రాజకీయ, సైనిక మార్పులు సంభవిస్తాయని భావిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *