కొంతమందిని చూడగానే కుక్కలు విపరీతంగా అరుస్తూ, దూకుడుగా ప్రవర్తించడాన్ని మీరు గమనించే ఉంటారు. అసలు కుక్కలు అలా ఎందుకు చేస్తాయి? దీని వెనుక ఉన్న కారణాలేంటో చాలామందికి తెలియదు. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…
కుక్కల గ్రహణ శక్తి: మనుషుల ఇంద్రియాల కంటే కుక్కల ఇంద్రియాలు ఎన్నో రెట్లు శక్తివంతంగా పనిచేస్తాయి. ఒక వ్యక్తి నడిచే తీరు, వారి కదలికలను కుక్కలు వెంటనే గుర్తిస్తాయి. కుక్కలు మనుషుల కదలికలపై చాలా నిశితంగా నిఘా ఉంచుతాయి, అందుకే అవి ప్రజలను సులభంగా గుర్తుపడతాయి. అయితే, కొంతమందిని చూడగానే మాత్రం అవి ఎందుకు అరుస్తాయంటే:
- భయం మరియు బాడీ లాంగ్వేజ్: మీరు కుక్క ముందు నుండి ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా వెళ్తే, అది సాధారణంగా అరవదు. కానీ మీరు భయపడుతూ నడుస్తున్నా లేదా మీ కదలికల్లో వణుకు ఉన్నా, కుక్క దానిని వెంటనే కనిపెడుతుంది. మీ ప్రవర్తన చూసి తనకు ఏదో ప్రమాదం ఉందని కుక్క భావిస్తుంది, అందుకే రక్షణ కోసం అరుస్తుంది.
- జ్ఞాపకశక్తి: కుక్కలకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. గతంలో జరిగిన విషయాలను అవి అంత సులభంగా మర్చిపోవు. గతంలో ఎవరైనా వ్యక్తి ఆ కుక్కను కొట్టినా లేదా దానిపై దాడి చేసినా, ఆ వ్యక్తిని చూడగానే కుక్క తనను తాను కాపాడుకోవడానికి గట్టిగా అరుస్తుంది.
- భద్రతా భావం: తన నుండి తనకు ముప్పు ఉందని అనిపించగానే కుక్క తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది.
ఏం చేయాలి? ఒకవేళ కుక్క మీపై నిరంతరం అరుస్తుంటే, మరీ ఎక్కువగా భయపడకండి. దానితో నెమ్మదిగా పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కసారి కుక్కకు మీపై నమ్మకం కలిగిందంటే, అది మీకు మంచి స్నేహితుడిగా మారుతుంది.
